Kotha Lokah | దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫరర్ ఫిలిమ్స్ నిర్మించిన ఏడవ చిత్రం ‘లోక: చాప్టర్ వన్ – చంద్ర’ (కొత్త లోక) మలయాళ సినిమా ఇండస్ట్రీకి మరో మైలురాయిగా నిలిచింది. బుక్ మై షో ద్వారా టికెట్ అమ్మకాలలో ఈ సినిమా రికార్డు సృష్టించింది. 18 రోజుల్లోనే ఈ చిత్రానికి సంబంధించి 4.52 మిలియన్ టిక్కెట్లు అమ్ముడవ్వగా, ఇంతకుముందు మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’ 4.51 మిలియన్ టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రం మోహన్ లాల్ మూవీ రికార్డును అధిగమించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.250 కోట్ల వసూళ్లు సాధించింది.
మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన రెండవ సినిమాగా నిలిచింది. కేవలం 19 రోజుల్లోనే ఈ ఘనత అందుకోవడం విశేషం. ప్రస్తుతం కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌కి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. కేరళలో ప్రసిద్ధి చెందిన కల్లింగట్టు నీలి కథ నుండి ప్రేరణతో ఈ మూవీని సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి భాగంగా తెరకెక్కించారు. మొత్తం ఐదు భాగాల సిరీస్‌లో ఇదే మొదటి చిత్రం. దుల్కర్, టొవినో అతిథి పాత్రల్లో కనిపించారు.
ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ సాధించి, బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లు అందుకుంటోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్ల క్లబ్లో చేరి కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టించగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన OTT రైట్స్ డీల్ మరోసారి సినిమా బిజినెస్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు, ఈ సినిమాకు OTT రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుండగా, డీల్ విలువ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం.