అహ్మదాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. ఇండియన్ ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది 11వ సెంచరీ కాగా, భారత గడ్డపై అతను రెండో టెస్టు సెంచరీ కావడం విశేషం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇండియా రెండో రోజు తాజా సమాచారం ప్రకారం 67 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 218 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ 190 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ సెంచరీలో 12 బౌండరీలు ఉన్నాయి. భారత కెప్టెన్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు.
Test hundred No. 1⃣1⃣ for KL Rahul 💯
The opener continues his sublime form 👏#TeamIndia have gone past 200 runs.
Updates ▶ https://t.co/MNXdZcelkD#INDvWI | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/c69vJbFFVD
— BCCI (@BCCI) October 3, 2025
చాన్నాళ్ల తర్వాత సెంచరీ చేశాడు రాహుల్. దాదాపు 3211 రోజుల విరామం తర్వాత స్వదేశీ గడ్డపై భారీ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నైలో ఇంగ్లండ్‌తో 2016, డిసెంబర్లో జరిగిన టెస్టులో చివరి సారి రాహుల్ సెంచరీ స్కోర్ చేశాడు. రాహుల్ సెంచరీతో భారత్ తొలి టెస్టులో పట్టు సాధించే దిశగా వెళ్తోంది. క్రీజ్‌లో జురెల్ ఉన్నాడు.