జేఎన్టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ కిషన్కుమార్రెడ్డి భార్య సుజనారెడ్డి తనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : గత నెల 8న ఆమెను పోలీస్స్టేషన్లో దూషిం చి, బెదిరించినట్టు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఎన్నడూ చూడలేదని స్పష్టంచేశారు. తాను వీసీకి ఫోన్ చేసిన సమయంలో ఆయన బాత్రూమ్లో ఉన్నారని వేరొకరు చెప్పగా, వీసీతోనే మాట్లాడుతానని చెప్పి కాల్ కట్ చేశానని తెలిపారు.
ఆ తర్వాత ఆయనతో నేరుగా మాట్లాడి, యూనివర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్లను, ప్రత్యేకించి మహిళా అధ్యాపకులను అసభ్యంగా దూషించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశానని స్పష్టతనిచ్చారు. తనపై వ్యతిరేకత ఉంటే నేరుగా తననే ప్రశ్నించవచ్చని, మహిళా ప్రొఫెసర్లను కించపరచడం తగదని హెచ్చరించగా.. వీసీ తన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పారని పల్లా పేరొన్నారు. తిరుపతి నుంచి వచ్చాక లేఖ ఇస్తానని చెప్పి.. మాట తప్పడంతో మహిళా ప్రొఫెసర్లు పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఆ వివాదం నుంచి తప్పించుకునేందుకే వీసీ తన భార్యతో తప్పుడు ఫిర్యాదు చేయించారని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

