Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Kiara Advani | బాలీవుడ్ ప్రముఖ నటి కియారా అద్వానీ ఇటీవల నటించిన 'టాక్సిక్' సినిమా విడుదల సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, భావోద్వేగాల గురించి తాజాగా ఓపెన్ అయ్యారు.
Kiara Advani | బాలీవుడ్ ప్రముఖ నటి కియారా అద్వానీ ఇటీవల నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదల సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, భావోద్వేగాల గురించి తాజాగా ఓపెన్ అయ్యారు. సినిమా మొదటి రోజు వచ్చిన భారీ ఓపెనింగ్ కలెక్షన్లను చూసి అంతా సంతోషించినప్పటికీ, ఆ తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం తన బృందానికి ఎంతో బాధ కలిగించిందని ఆమె తెలిపారు. ముఖ్యంగా ఆ తొలి వారాంతంలో ఈ పరాజయం తనను ఎంతగానో కుంగదీసిందని, ఆ క్షణాలు తనను తీవ్ర నిరాశకు గురిచేశాయని కియారా పేర్కొన్నారు. అయితే, తన సాధారణ కంఫర్ట్ జోన్‌ను పూర్తిగా పక్కన పెట్టి, కెరీర్లోనే ఎంతో సవాల్‌తో కూడిన ఒక విభిన్నమైన పాత్రను పోషించానని, ఆ పాత్రకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడం తనకు కాస్త ఊరటనిచ్చిందని చెప్పారు.
ఈ సందర్భంలో పెళ్లి తర్వాత సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలలో నటించడంపై వస్తున్న ట్రోల్స్, విమర్శల గురించి కూడా ఆమె స్పందించారు. తన భర్త, ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఈ విషయంలో ఎంతో మెచ్యూరిడ్గా వ్యవహరించారని కియారా కొనియాడారు. పెళ్లి తర్వాత రొమాంటిక్ సీన్లలో నటించడంపై సిద్ధార్థ్ ఎలాంటి అభ్యంతరం తెలపకపోగా, ఆ విషయాన్ని అసలు పట్టించుకోలేదని, ఎప్పుడూ తనతో ఆ గురించి ప్రస్తావించనేలేదని ఆమె వెల్లడించారు. తమ వివాహం తర్వాత ఈ అంశంపై ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదని, ఆయనకు దీనిపై ఎలాంటి నెగెటివ్ అభిప్రాయం లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

