రష్యాలో ఉద్భవించిన ఈ కెటెల్ బెల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కారణం, దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 2 నుంచి 50 కిలోల బరువు ఉండే కెటెల్ బెల్స్ బంతి ఆకారంలో ఉంటాయి. చేతితో పట్టుకునేందుకు వీలుగా, వ్యాయామం చేసేందుకు సులువుగా ఉంటాయి. దీంతో పలు రకాల వ్యాయామాలు చేయవచ్చు.