తిరువనంతపురం: భారత్లో ముఖ్యంగా కేరళలో విరివిగా కనిపించే మనతక్కలి మొక్క కాలేయ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ఎఫ్డీఏ అధికారికంగా గుర్తించింది. మొక్కలోని ఆకుల్లో ఉండే ఆట్రోసైడ్-డీ అనే పదార్థం లివర్ క్యాన్సర్ ఔషధాల తయారీలో దోహదం చేస్తుందని పేర్కొన్నది. ఆట్రోసైడ్-డీని మొట్టమొదటగా రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘లివర్ క్యాన్సర్ చికిత్సకు ఇప్పటివరకు ఎఫ్డీఏ ఆమోదం తెలిపిన ఔషధం కేవలం ఒకటే ఉంది. తాజా ఆవిష్కరణ మరిన్ని ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది’ అని సీనియర్ సైంటిస్ట్ రూబీ జాన్ ఆంటో చెప్పారు.