Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Keerthy Suresh | నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'సత్యవాన్ సావిత్రి' (Sathyavan Savithiri).
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’ (Sathyavan Savithiri). ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ తాజాగా విడుదలైంది. కామెడీ, కోర్టు డ్రామా మరియు లీగల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టీజర్‌తో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిన్నప్పటి నుంచి లాయర్ కావాలనే కసితో, ఫ్యామిలీని ఎదురించి లా చదివిన ‘సావిత్రి’ అనే యువతి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. తను టేకప్ చేసిన తొలి కేసులో ఆమె ఎదుర్కొనే సవాళ్లు, కోర్టులో జడ్జిలకు ఆమె చేసే అమాయకపు వాదనలు టీజర్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ ప్రముఖ దర్శకుడు, నటుడు మిస్కిన్ కాగా, సావిత్రికి ఎదురుగా కోర్టులో వాదించే పవర్ఫుల్ లాయర్ ‘మార్కండేయన్’ పాత్రలో ఆయన కనిపించనున్నారు. కీర్తి సురేష్ మరియు మిస్కిన్ మధ్య జరిగే కోర్టు రూమ్ వార్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది.
ఈ చిత్రంలో కీర్తి సురేష్, మిస్కిన్లతో పాటు చారుకేశ్, బాల శరవణన్, శిల్పా మంజునాథ్, బాలాజీ శక్తివేల్, ఆర్. సుందర్రాజన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సీరియస్ కోర్టు రూమ్ డ్రామాను కూడా చక్కటి వినోదం, హ్యూమర్‌తో మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20, 2026 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

