Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Haindava Teaser | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సంయుక్త హీరోయిన్గా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం 'హైందవ' అఫీషియల్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి స్పందనతో దూసుకుపోతోంది.
Haindava Teaser | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సంయుక్త హీరోయిన్గా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘హైందవ’ అఫీషియల్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి స్పందనతో దూసుకుపోతోంది. లూధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైన కేవలం 16 గంటల్లోనే 8,65,523 పైచిలుకు వ్యూస్‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది.
రంగాపురం అనే గ్రామంలోని పురాతన ఆలయంలో పది దైవ విగ్రహాలు ఒక్కసారిగా మాయమవడం, అదే సమయంలో గ్రామంలో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురికావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ మిస్టరీ మరియు క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ను చేధించడానికి దేవుడి కంటే మానవత్వం, హేతువాదంపై నమ్మకం ఉండే ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్ ఆలయ పూజారిగా నటిస్తుండగా, సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మికత, క్రైమ్, నమ్మకాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మిస్టికల్ డివోషనల్ థ్రిల్లర్ చిత్రాన్ని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీసర్లో వచ్చే “జరగబోయేది చెప్పి.. అది ఎలా జరుగుతుందో కళ్లారా చూపించేవాడే దేవుడు” వంటి డైలాగ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

