Nakkala Punna Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిన్ననాటి గురువు నక్కల పున్నారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలోని స్వగృహంలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
నక్కల పున్నారెడ్డి మరణవార్త తెలియగానే పలువురు సంతాపం తెలిపారు. పున్నారెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించేందుకు ఆత్మీయులు పెద్దగుండవెల్లికి తరలివస్తున్నారు.