Ranveer Singh | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ‘డాన్ 3’ సినిమా నుంచి ఆయన అకస్మాత్తుగా తప్పుకోవడం వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, అందుకే రణవీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) మూడు సంవత్సరాల పాటు నిషేధం జారీ చేసిందనే వార్త చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సంచలనంగా మారింది.
అయితే ఈ వివాదంపై FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘డాన్ 3’ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ విదేశాలకు వెళుతుండగా కేవలం మూడు వారాల ముందు రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా తప్పుకున్నారని తెలిపారు. దీనివల్ల దర్శకుడు, నిర్మాత అయిన ఫర్హాన్ అక్తర్ మరియు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్కు సుమారు రూ.45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. ఇది కేవలం నిర్మాతలకే కాకుండా, ఈ సినిమా కోసం ఇప్పటికే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న కెమెరామెన్లు, సాంకేతిక నిపుణులు మరియు వందలాది మంది బాలీవుడ్‌కి చెందిన వేతన కార్మికులు కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నష్టానికి సంబంధించి ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు చేసిన తర్వాత, వివరణ ఇవ్వాల్సిందిగా రణవీర్ సింగ్‌కు FWICE వరుసగా మూడు సార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని అశోక్ పండిట్ పేర్కొన్నారు. చివరకు ఈ విషయంపై తాము ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతామని ప్రకటించిన తర్వాతే… ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం ఫెడరేషన్‌కు లేదంటూ రణవీర్ మెయిల్ పంపారని, ఈ బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్లే ఆయనపై ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వివాదంపై రణవీర్ సింగ్ ప్రతినిధులు స్పందిస్తూ, రణవీర్ సింగ్‌కు చిత్ర పరిశ్రమ మరియు ‘డాన్’ ఫ్రాంచైజీపై ఎంతో గౌరవం ఉందని, వృత్తిపరమైన విషయాలను ఎల్లప్పుడూ హుందాగా, పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాలని ఆయన భావిస్తారని తెలిపారు. కథ (స్క్రిప్ట్) విషయంలో వచ్చిన కొన్ని క్రియేటివ్ విభేదాల వల్లే రణవీర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని, అందువల్లే ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన టీమ్ వెల్లడించింది.
Bollywood Hero #RanveerSingh banned from bollywood for 3 years
Ashoke Pandit explains how Ranveer Singh exited Don 3 just 3 weeks before the shoot, causing massive losses to the makers.
According to him, Farhan Akhtar suffered a loss of around ₹45 crore, while technicians,… pic.twitter.com/ndgFK2sTdW
— Milagro Movies (@MilagroMovies) May 26, 2026