కృష్ణ, చాణక్య, రేఖ నిరోష, యశ్నచౌదరి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కటారి కృష్ణ’. ప్రకాష్ తిరుమలశెట్టి దర్శకుడు. పీఏనాయుడు, నాగరాజు తిరుమలశెట్టి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను శుక్రవారం హైదరాబాద్లో సీనియర్ నటుడు మురళీమోహన్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఔత్సాహిక దర్శకనిర్మాతలు కొత్త ఆలోచనలతో సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని చాటుతుండటం అభినందనీయం’ అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘రొమాంటిక్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ హంగుల కలబోతగా రూపొందుతున్న చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసి ఈ నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. కటారి కృష్ణ ఎవరు? అతడి పోరాటం ఎవరికోసమన్నది ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్పారు.