Sardar2 | కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) నటించిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ (Sardar 2) టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2022లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘సర్దార్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. ఈ టీజర్ వివిధ భాషల్లో కేవలం ఒక్క రోజులోనే యూట్యూబ్‌లో 1.1 మిలియన్లకు పైగా (Combined Views) వ్యూస్‌ను సాధించి దూసుకుపోతోంది. ఇందులో ప్రధానంగా తమిళ వెర్షన్ టీజర్ 9.19 లక్షలకు పైగా వ్యూస్‌ను రాబట్టగా, తెలుగు వెర్షన్ టీజర్ సైతం 2.12 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది.
మొదటి భాగంలో మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించిన కార్తీ, ఈ సీక్వెల్లో కూడా తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం (డ్యూయెల్ రోల్) చేస్తున్నారు. తండ్రి పాత్ర రగ్డ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించనుండగా, కొడుకు పాత్ర స్టైలిష్ అండ్ కూల్ గైగా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ ఎస్జే సూర్య అత్యంత శక్తివంతమైన, స్టైలిష్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. టీజర్లో ఆయన చెప్పే డైలాగులు, కార్తీతో నడిచే హోరాహోరీ సన్నివేశాలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. పి.ఎస్. మిత్రన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.ఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో కార్తీ సరసన టాలెంటెడ్ హీరోయిన్లు మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటిస్తుండగా, భారీ తారాగణం ఈ సినిమాలో భాగం కానుంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.