పోస్ట్‌మార్టమ్‌కు ముందు మృతదేహంలో కదలిక

బెంగళూరు: పోస్ట్‌మార్టమ్‌కు ముందు మృతదేహంలో కదలిక కనిపించింది. దీంతో ఆ వ్యక్తి మరణించలేదని గ్రహించి తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. కర్ణాటకలోని మహాలింగపూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల వ్యక్తి బైక్ డ్రైవ్ చేస్తుండగా ఆదివారం ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించగా కొంత సేపటి తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ తొలగించారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి శవాగారానికి తరలించారు.
కాగా, సోమవారం మృతదేహాన్ని బల్లపై ఉంచిన వైద్యులు పోస్ట్‌మార్టమ్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఆ వ్యక్తి శరీరంలో కదలిక గుర్తించారు. దీంతో పరీక్షించగా అతడు మరణించలేదని తెలిసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆ వ్యక్తిని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగవుతున్నదని వారు తెలిపారు. దీంతో చనిపోయినట్లు తప్పుగా చెప్పిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులపై ఫిర్యాదు చేసేందుకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

