బెంగళూరు: ఇజ్రాయెల్ పర్యాటకురాలు సహా ఇద్దరిపై అత్యాచారం, మరో టూరిస్ట్‌ను హత్య చేసిన ముగ్గురు దోషులకు కర్ణాటకలోని గంగావతి కోర్టు మరణశిక్ష విధించింది. ఫిబ్రవరి 6న వారిని దోషులుగా తేల్చింది.
సోమవారం ఈ కేసులో న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక్ దోషులకు శిక్షను ఖరారు చేస్తూ, ముగ్గురికి మరణశిక్ష విధించారు. క్రూరమైన నేరంలో దోషులుగా తేలిన మల్లేశ్ అలియాస్ హందిమల్లా, సాయి, శరణప్పలకు ఉరిశిక్ష ఖరారు చేశారు.