Kajal Agarwal | సౌత్ ఇండస్ట్రీలో ఉన్న విలువలు బాలీవుడ్లో లేవు : కాజల్ అగర్వాల్
Kajal Agarwal Sensational Comments | 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. తొలి సినిమానే కాజల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే 2009లో వచ్చిన 'మగధీర' కాజల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.
Kajal Agarwal Sensational Comments | ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. తొలి సినిమానే కాజల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే 2009లో వచ్చిన ‘మగధీర’ కాజల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యూత్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత వరుసగా డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా సినిమా సినిమాకు తన క్రేజ్ పెరుగుతూ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ దక్షిణాది సినిమాలు వర్సెస్ బాలీవుడ్ అనే టాపిక్‌పై స్పందించి.. బాలీవుడ్లో నైతికత లోపించింది. దక్షిణాదిలో ఉన్న విలువలు బాలీవుడ్లో లేవని తెలిపింది. టాలెంట్ ఉంటే దక్షిణాది ప్రేక్షకులు తప్పకుండా అంగీకరిస్తారని కాజల్ వెల్లడించింది. తను పుట్టి పెరిగింది ముంబాయి నగరమే అయినా తన కెరీర్ మొదలైంది మాత్రం హైదరాబాద్‌లోనేనని చెప్పింది. దక్షిణాది ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, అక్కడ అద్భుతమైన దర్శకులు, టెక్నీషియన్లు ఉన్నారని తెలిపింది. దక్షిణాది నుంచి మంచి కంటెంట్ వస్తుందని కొనియాడింది.

బాలీవుడ్‌లోనూ తను మంచి సినిమాల్లో నటించినప్పటికీ, దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతికత, విలువలు ఇక్కడ లోపించాయని భావిస్తున్నట్లు కాజల్ చెప్పుకొచ్చింది. దీనిపై దక్షిణాది ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. హిందీ ప్రేక్షకులు మాత్రం కాజల్‌పై ఫైర్ అవుతున్నారు. ఇక ఇటీవలే ప్రియాంక చోప్రా బాలీవుడ్లో రాజకీయలు ఎక్కవైపోయాయంటూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అక్కడి సినీతారలు, ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. ఇక ఇప్పుడు కాజల్ కూడా ఆ లిస్ట్‌లో చేరడంతో సోషల్ మీడియాలో కాజల్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

