Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Kaaka | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో మాస్ ట్రీట్ వచ్చేసింది. చాలా కాలం తర్వాత చిరంజీవిని పవర్ఫుల్ మాస్ అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు బాబీ కొల్లి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాకా’ ఇప్పటికే మంచి అంచనాలను ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు ప్రమోషన్లను కూడా మేకర్స్ జోరుగా కొనసాగిస్తున్నారు.
Kaaka | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో మాస్ ట్రీట్ వచ్చేసింది. చాలా కాలం తర్వాత చిరంజీవిని పవర్ఫుల్ మాస్ అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు బాబీ కొల్లి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాకా’ ఇప్పటికే మంచి అంచనాలను ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు ప్రమోషన్లను కూడా మేకర్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకుని విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీపావళి సందర్భంగా ‘కాకా’ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో చిరంజీవి ఒక పంట పొలంలో నిలబడి చేతిలో కొడవలి పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన ముఖంలో కోపం, చూపుల్లో తీవ్రత కనిపిస్తుండగా.. చేతిలో ఉన్న కొడవలికి రక్తపు మరకలు ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ పోస్టర్‌కు మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూడా అదిరిపోయేలా ఉంది. “ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు.. టపాసులు సంక్రాంతికి కలుద్దాం” అంటూ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, “సంక్రాంతి పండగకి ఈసారి.. పంటకి కోత, బాక్సాఫీస్‌కి ఊచకోత” అంటూ మరో మాస్ డైలాగ్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే సినిమాలో చిరంజీవి పాత్ర ఎంతటి పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేతిలోని కొడవలి, రక్తంతో కూడిన లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ సినిమాలో చిరంజీవి కదిరి కాళిదాస్ అనే పాత్రలో కనిపించనున్నారు. అయితే సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ సమయంలో మాత్రం ఆయనను ఆక్వా కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే సత్యం పాత్రలో పరిచయం చేశారు. ఆ సాధారణ వ్యక్తి వెనుక బలమైన గతం ఉందనే విషయాన్ని అప్పుడే హింట్ ఇచ్చారు. ఇప్పుడు విడుదలైన దీపావళి పోస్టర్ చూస్తుంటే ఆయన గతం ఎంతటి రక్తసిక్తమైనదో అనే ఆసక్తి కలుగుతోంది. అసలు సత్యం ఎవరు? కదిరి కాళిదాస్‌కు ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? ఆయన గతంలో ఎలాంటి పోరాటం చేశారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. చిరంజీవి పాత్రలో రెండు విభిన్న కోణాలు ఉండబోతున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ‘కాకా’ సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్రలో మలయాళ నటి అనశ్వర రాజన్ నటిస్తున్నారు. అలాగే నివేదా పేతురాజ్, బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన పాత్రలు, బలమైన కథాంశంతో ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

