హైదరాబాద్,జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 2023 బ్యాచ్ లెక్చరర్లకు వెంటనే ఇంక్రిమెంట్లు మంజూరు చేసి, ప్రొహిబిషన్ ప్రక్రియను పూర్తిచేసి రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ-475) ప్రెసిడెంట్ వీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కే సురేశ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం యూనియన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. 2023 బ్యాచ్ లెక్చరర్లకు బదిలీల అర్హతలో సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.