Commonwealth Games 2026 : కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారిణులు పోటాపోటీగా పతకాలు కొల్లగొడుతున్నారు. మొన్న పారా షాట్‌పుట్‌లో షర్మిలా ధన్కర్(Sharmila Dhankar) మొట్టమొదటి స్వర్ణంతో చరిత్ర సృష్టించగా.. జుడోలో అస్మితా డే (Asmita Dey) పసిడి వెలుగులు విరజిమ్మింది. మహిళల 48 కిలోల విభాగంలో చెలరేగిన అస్మిత కెనడా జుడోకా హెడీ క్వాచ్(Heidi Quach)నుచిత్తు చేసి దేశానికి నాలుగో స్వర్ణం అందించింది. అంతేకాదు కామన్వెల్త్లో జుడోలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పిందీ 23 ఏళ్ల ఛాంపియన్.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు జోరు కొనసాగుతున్నారు. జుడోలో అద్భుతంగా రాణించిన అస్మితా డే ఈ విభాగంలో దేశానికి మొట్టమొదటి పసిడి పతకాన్ని అందించింది. శుక్రవారం మహిళల 48 కిలోల ఫైనల్లో ఉడుంపట్టు పట్టిన అస్మిత కెనడా జుడోకా హెడీ క్వాచ్ను 2-1తో మట్టికరిపించింది. దాంతో.. జుడోలో మరే భారతీయురాలికి సాధ్యమవ్వని ఘనతను సొంతం చేసుకుంది అస్మిత. చరిత్రాత్మక పతకం సాధించిన అనంతరం సంబురాల్లో మునిగిపోయింది భారత జుడోకా.
🇮🇳🥹 India’s first-ever Commonwealth Games Gold Medal in Judo.
Asmita Dey has etched her name into Indian sporting history! 🥇
She defeats Canada’s Heidi Quach 2-1 to win the Women’s -48kg Judo Gold at the Commonwealth Games 2026.pic.twitter.com/4KEKWaDmXG
— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 31, 2026
‘ఈ రోజు 48 కిలోల విభాగంలో నేను అత్యుత్తమం అనుకున్నా. ఎలాగైనా ఈసారి దేశం కోసం, నా కోసం, నా కోచ్, తల్లిదండ్రుల కోసం స్వర్ణం గెలవాలనుకున్నా. నేను ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. నాకు యూపీ పోలీస్‌లో ఉద్యోగం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు. అప్పటి నుంచి నాకు జుడోలో రాణించేందుకు అవసరమైన మద్దతు లభించింది. అందరి ప్రోత్సాహంతోనే నేను ఇక్కడి వరకూ వచ్చాను. గోల్డ్ మెడల్ గెలిచా. ఈ పతకాన్ని మా నాన్నకు అంకితమిస్తున్నా’ అని అస్మిత భావోద్వేగంతో చెప్పింది.
#WATCH | Glasgow | Indian Athlete Asmita Dey says, “I am really happy to win this medal; This medal was very important for me, my state and my country… I dedicate it to my coach… My father, who passed away in December 2025, had supported me a lot, but I felt that everything was… https://t.co/G3YPdDXuUv pic.twitter.com/KzJjcP9BQm
— ANI (@ANI) July 31, 2026