పోలీసులపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి
పోలీసులపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి | మ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు.

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రనేడ్ పోలీసులకు దూరంగా పడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సాంబా-ఉధంపూర్ రోడ్లో నాడ్ వద్ద చోటు చేసుకుందని చెప్పారు. పోలీస్ పార్టీ వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వారిని లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరారని పేర్కొన్నారు. గ్రనేడ్ పోలీసులకు దూరంలో బహిరంగ ప్రదేశంలో పడి పేలింది. ఇందులో ఎవరికీ ఏమీ కాలేదని, వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇవికూడా చదవండి..
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఆక్సిజన్ అందక నాలుగు గంటల్లో 26 మంది మృతి
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్
కరోనా ఇండియన్ వేరియంట్ 44 దేశాల్లో గుర్తింపు : WHO
బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్డౌన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

