భారత్‌లో మూడో విడుత కిన్లికల్ ట్రయల్స్ కోసం జేఅండ్‌జే దరఖాస్తు
మూడో విడుత కిన్లికల్ |

న్యూఢిల్లీ : భారత్‌లో మూడో విడుత క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ మల్టీనేషనల్ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసినట్లు డీసీజీఐ వర్గాలు తెలిపాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ స్టేట్స్, యూరప్, బ్రిటన్, జపాన్‌లోని రెగ్యులేటర్ల ఆమోదం పొందిన విదేశీ టీకాలకు ఆమోదాన్ని వేగవంతం చేయాలని కేంద్రం గతవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. జేఅండ్‌జే కంపెనీ సుగమ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ విభాగంలో ఈ నెల 12న దరఖాస్తు చేసింది.

సాంకేతిక కారణాలతో మళ్లీ జాన్సన్ అండ్ జాన్సన్ సోమవారం మళ్లీ తిరిగి దరఖాస్తు చేసిందని డీసీజీఐ వర్గాలు పేర్కొన్నాయి. జేఅండ్‌జే వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో మూడు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇది సింగిల్ డోస్ టీకా. అయితే, ఇప్పటి వరకు దేశంలో మూడు వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవన్నీ రెండు మోతాదుల వ్యాక్సిన్లే. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కొవిషీల్డ్’, భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.

కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అత్యవసర వినియోగం కింద ఇప్పటికే వినియోగిస్తుండగా.. త్వరలోనే స్పుత్నిక్ వీ టీకాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉండగా.. దేశంలో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ మే ఒకటి నుంచి టీకాలు వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు హాస్పిటళ్లు టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా సేకరించేందుకు అనుమతులు సైతం జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన
20.01.2021 మంగళవారం, మీ రాశిఫలాలు
ఢిల్లీ స్కూల్స్‌కు రేపటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు
సీఎం కేసీఆర్‌కు కరోనా.. త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్
మార్స్‌పై ఎగిరిన హెలికాప్టర్
భారత్‌ను ట్రావెల్ రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చిన బ్రిటన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

