మార్స్‌పై ఎగిరిన హెలికాప్టర్
- అంతరిక్ష పరిశోధనల్లో కొత్త శకం.. నాసా అద్భుత విజయం
- 30 సెకండ్లు ఇన్జెన్యువిటీ చక్కర్లు
- వేరే గ్రహంపై ఇలాంటి ప్రయోగం మానవజాతి చరిత్రలో తొలిసారి

కేప్ కార్నివాల్, ఏప్రిల్ 19: నాసా అద్భుతం చేసింది. అంగారక గ్రహంపై ఇన్జెన్యూవిటీ అనే పేరున్న హెలికాప్టర్‌ను నడిపించి అద్భుతాన్ని రోదసి పరిశోధనల్లో కొత్త చరిత్రను సృష్టించింది. భూమిపై నుంచి నియంత్రిస్తూ భూమికి ఆవల మరో గ్రహంపై హెలికాప్టర్‌ను నడుపడం మానవజాతి చరిత్రలో ఇదే తొలిసారి. నాసా సాధించిన ఈ గొప్ప విజయాన్ని 117 ఏండ్ల క్రితం రైట్ సోదరులు మొదటిసారి విమానాన్ని విజయవంతంగా నడిపించిన ఘటనతో పోల్చుతున్నారు. ఇన్జెన్యువిటీ అంగారక గ్రహం ఉపరితలానికి 3 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న దృశ్యాలను పర్సవరెన్స్ రోవర్ 65 మీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసి నాసాకు పంపించింది. ఇన్జెన్యువిటీ 30 సెకండ్ల పాటు విహరించింది. తమ ప్రయోగం విజయవంతం కావడం పట్ల నాసా సంతోషం వ్యక్తం చేసింది. ‘ఏ ప్రపంచంలోనైనా మొట్టమొదటిసారి అని చెప్పుకోవడం ఒక్కసారే సంభవిస్తుంది. అంగారకుడిపై అది మనం చేశాం. వేరే గ్రహం మీద మానవులు హెలికాప్టర్‌ను నడిపించారు’ అని ఈ ప్రాజెక్టు మేనేజర్ ఆంగ్ ప్రకటించారు. ఇన్జెన్యువిటి బరువు 1.8 కిలోలు. పర్సవరెన్స్‌తో పాటే దీనిని 28.9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ మీదకు పంపించారు. ఈ నెల 3న హెలికాప్టర్ అంగారకుడి ఉపరితలంపై దిగింది.
అక్కడ మైనస్ 93 డిగ్రీల చలి
భూమి మీద ఎన్నో విమానాలు, హెలికాప్టర్లు ఎగురుతున్నా వేరే గ్రహాల మీద ఇప్పటివరకు అలాంటి ప్రయోగాలు జరుగలేదు. అక్కడి వాతావరణ పరిస్థితులపై అవగాహన లేకపోవడం, భూమిపై వాడే సాంకేతికత అక్కడ పనిచేయకపోవడమే అందుకు కారణం. మార్స్ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇన్జెన్యువిటీని 6 ఏండ్లు కష్టపడి నాసా తయారుచేసింది. అక్కడి అతిశీతల (మైనస్ 93 డిగ్రీలు) వాతావరణాన్ని తట్టుకొని కూడా బ్యాటరీలు పనిచేసేలా దాని ఉపరితలంపై ప్రత్యేక లోహాలు వాడింది. రీచార్జింగ్ కోసం సోలార్ ప్యానళ్లు అమర్చింది. హెలికాప్టర్ ఎగరాలంటే దాని రెక్కలు భూమిపై నిమిషానికి 500 సార్లు తిరగాలి. కానీ అంగారకుడిపై సాంద్రత తక్కువ కాబట్టి భూమి మీది కంటే 5 రెట్లు ఎక్కువ వేగంగా తిరిగేలా చేసి హెలికాప్టర్‌ను నడిపించటంలో విజయం సాధించారు నాసా శాస్త్రవేత్తలు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Helicopter flying
- Mars
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

