చిన్న పిల్లలు ఏ డ్రెస్సు వేసినా అందంగా కనిపిస్తారు. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తే మరింత ముచ్చటగా ఉంటారు. పాతకొత్తల మేలు కలయికలాంటి స్కర్ట్లు, వాటికి మరింత అందాన్నిచ్చే క్రాప్‌టాప్‌లు చిన్నారుల ఫ్యాషన్ ప్రపంచాన్ని
ఏలేస్తున్నాయి. కలంకారి ఫ్యాబ్రిక్‌పై రఫుల్స్ జతచేసిన స్మార్ట్ స్కర్ట్ డిజైన్లేమిటో చూద్దాం..
షార్ట్ అండ్ క్యూట్..
బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్‌పై నెమళ్లు, పూలతో డిజైన్ చేసిన స్కర్ట్ ఇది. కలంకారి ఫ్యాబ్రిక్‌తో షార్ట్ సైజ్‌లో రూపొందించారు. వ్రాప్ స్టయిల్లో ఇచ్చిన లేయర్, దానిపై జతచేసిన సెల్ఫ్ కలంకారి రఫుల్స్ ట్రెండీలుక్ తెచ్చాయి. రెండు లేయర్లలో ఇచ్చిన రఫుల్స్ చక్కని గౌనును తలపిస్తున్నాయి. కాంట్రాస్టింగ్‌గా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్‌పై లైట్ గ్రీన్ కలర్ త్రెడ్వర్క్తో టాప్ ఇచ్చారు. స్లీవ్స్‌గా రెండు లేయర్లలో జతచేసిన రఫుల్స్ అదరగొడుతున్నాయి.
సంప్రదాయంగా..
ట్రెండీలుక్తోపాటు సంప్రదాయాన్ని జోడించిన డిజైన్ ఇది. బ్రౌన్ కలర్ బేస్‌పై పూలతో కూడిన కలంకారి ఫ్యాబ్రిక్‌తో ఫ్లిట్స్ ఇచ్చారు. పూలలోని క్రీం కలర్ వస్ర్తానికి చికంకారీ వర్క్ ఫ్యాబ్రిక్‌తో బార్డర్ బావుంది. మరింత అందం కోసం రఫుల్స్ జత
చేశారు. బార్డర్ కలర్లో ఇచ్చిన టాప్ చక్కగా నప్పింది. హ్యాండ్స్, వెయిస్ట్ పార్ట్‌లో జత
చేసిన చిన్న రౌండింగ్ ప్లిట్స్ ముచ్చటగా ఉన్నాయి.
మోడల్: హద్విత