న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడింది. అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయాస్‌కు సిఫారసు చేసింది. దాంతో గవర్నర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద సోరెన్‌పై అనర్హత వేటు వేశారు.
దాంతో జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. జార్ఖండ్ తదుపరి సీఎం ఎవరనే దానిపై చర్చ మొదలైంది. హేమంత్ సోరెన్ వైదొలిగితే ఆయన సతీమణికి సీఎం పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతున్నది. ఈ ఉదయం సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలతో సోరెన్ సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల్లో ఏం జరిగిందన్నది బయటకు వెల్లడి కాలేదు.
ఇదిలావుంటే, హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడినా ఆయన మరో ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలిచి, మిత్రపక్ష కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే తిరిగి సీఎం అయ్యే అవకాశం ఉన్నది. అయితే సోరెన్ ఏం చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్నది