యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. శ్రీమతి విజయలక్ష్మి సమర్పణలో బలగ ప్రకాష్ నిర్మించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత బలగ ప్రకాష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ‘ఈ కథ విన్నప్పుడు సుమ నటిస్తేనే సినిమా చేద్దామని అనుకున్నాను. ప్రతి మహిళ అంతరంగం ఈ సినిమా. పల్లె వాతావరణంలో రూపొందిస్తేనే కథలోని అనుభూతి వస్తుందని సీతంపేట వెళ్లి షూటింగ్ చేశాం. కీరవాణి సంగీతం, సుమ నటన ఈ చిత్రానికి ఆకర్షణ అవుతాయి. ఈ సినిమా విడుదలయ్యాక సుమను జయమ్మ అని పిలుస్తారు. సుమ మీద గౌరవంతో చాలా మంది పేరున్న దర్శకులు, హీరోలు సినిమాకు ప్రచారం చేశారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు’అన్నారు.