Jayakrishna Ghattamaneni | టాలీవుడ్లో ఘట్టమనేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని ప్రస్తుతం మహేష్ బాబు కొనసాగిస్తుండగా, ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. మహేష్ బాబు అన్నయ్య, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.ఆదివారం ఈ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. సీనియర్ నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో, P. కిరణ్ నిర్మాణంలో ‘చందమామ కథలు పిక్చర్స్’ అనే కొత్త బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘RX100’ వంటి రా & రస్టిక్ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తిరుపతి విజువల్స్ ఉండటంతో ఈ కథ ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. జయకృష్ణ లుక్ కూడా ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ సినీ ఎంట్రీ ఎప్పుడన్న దానిపై అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో, ఆయన మేనల్లుడు జయకృష్ణ ముందుగా హీరోగా రంగప్రవేశం చేయడం ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్గా మారింది.
జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కూడా గతంలో అనేక చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందారు. ఆయన 2022లో మరణించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఘట్టమనేని వారసత్వాన్ని కొనసాగించబోతుండగా, ఈ కొత్త హీరోపై ఘట్టమనేని అభిమానులంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.కాగా, అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయమై,ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు . రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో అజయ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి మహాసముద్రం అనే సినిమా చేసిన ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ఆతర్వాత మంగళవారం అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. అజయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు జయకృష్ణను హీరోగా పెట్టి సినిమా చేస్తుండగా, ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలో దీని పై అధికారిక ప్రకటన విడుదల కానుందని అంటున్నారు