e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News 'జాతిర‌త్నాలు' డైరెక్ట‌ర్ తో 'ఉప్పెన' హీరో సినిమా..!

‘జాతిర‌త్నాలు’ డైరెక్ట‌ర్ తో ‘ఉప్పెన’ హీరో సినిమా..!

'జాతిర‌త్నాలు' డైరెక్ట‌ర్ తో 'ఉప్పెన' హీరో సినిమా..!

డైరెక్ట‌ర్, హీరో టాలీవుడ్ కు ఇటీవ‌లే మంచి హిట్ ఇచ్చారు. ఇద్ద‌రూ త‌మ మొద‌టి సినిమా విజ‌యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇపుడు మంచి జోష్ మీదున్న ఆ ఇద్ద‌రూ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఉప్పెన హీరో వైష్ణ‌వ్ తేజ్‌. జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ.  అనుదీప్‌-వైష్ణ‌వ్ తేజ్ కాంబోలో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ టాక్‌. నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టుకు అడ్వాన్స్ కింద కొంత మొత్తంలో డ‌బ్బు కూడా అంద‌జేశార‌ట‌.

ప్ర‌స్తుతం క్రిష్‌తో చేస్తున్న సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు  వైష్ణ‌వ్ . ఈ మూవీ షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే అనుదీప్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. జాతిర‌త్నాలు సినిమా మంచి టాక్ తో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుండ‌గా..ఉప్పెన ఇప్ప‌టికే 50 కోట్ల‌కుపైగా షేర్ మార్కును దాటింది. టాలీవుడ్ కు రెండు హిట్స్ ఇచ్చిన వైష్ణ‌వ్‌తేజ్‌-అనుదీప్ కేవీ ఎలాంటి హిట్ ఇస్తారో చూడాలి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
'జాతిర‌త్నాలు' డైరెక్ట‌ర్ తో 'ఉప్పెన' హీరో సినిమా..!

ట్రెండింగ్‌

Advertisement