స్వీయ దర్శకత్వంలో సతీష్‌బాబు రాటకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జాతర’. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాతలు. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో సతీష్‌బాబు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చిత్తూరు జిల్లా జాతర నేపథ్యంలో భావోద్వేగభరితమైన కథాంశంతో ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి’ అని చెప్పారు. దీయారాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.వి.ప్రసాద్, సంగీతం: శ్రీజిత్ ఎడవణ, రచన-దర్శకత్వం: సతీష్‌బాబు.