Tirumala | 19న శ్రీవారి వివిధ దర్శనాల జనవరి నెల కోటా విడుదల
Tirumala | 2026 జనవరి నెలకు సంబంధించి తిరుమలలో వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను ఈనెల 19న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
తిరుమల : 2026 జనవరి నెలకు ( January quota ) సంబంధించి తిరుమలలో (Tirumala) వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను ఈనెల 19న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ(TTD) అధికారులు వివరించారు. అక్టోబర్ 21న ఉదయం 10 గంటలకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని వివరించారు.
23న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 23న ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుందని ప్రకటించారు.
24న శ్రీవాణి దర్శన కోటా విడుదల
24న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విడుదల చేస్తామన్నారు.
25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను విడుదల చేస్తామని వెల్లడించారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

