ఆ రోజును మరిచిపోలేను
అత్యంత బిజీ బాలీవుడ్ కథానాయికల్లో జాన్వీకపూర్ ఒకరు. దేవర, పెద్ది సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువైన జాన్వీ.. ప్రస్తుతం లగ్ జా గలే, రాకా సినిమాలతో బిజీగా ఉన్నారు.
అత్యంత బిజీ బాలీవుడ్ కథానాయికల్లో జాన్వీకపూర్ ఒకరు. దేవర, పెద్ది సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువైన జాన్వీ.. ప్రస్తుతం లగ్ జా గలే, రాకా సినిమాలతో బిజీగా ఉన్నారు. నిత్యం ఏదో ఒక మాధ్యమం ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు చేరువలో ఉండే జాన్వీ.. తాజా ఇంటర్వ్యూలో తన తల్లి, దివంగత నటి శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘కథానాయికగా నా తొలి సినిమా ‘ధడక్'(2018). అయితే.. ఆ సినిమాను ఒప్పుకునే ముందు ఇంట్లో చాలా పెద్ద డ్రామానే నడిచింది.
హీరోయిన్ని అవుతానని అమ్మకు చెప్పగానే ఒక్కసారిగా ఆమె షాకయ్యింది. ‘అసలు నువ్వు కథానాయికగా సక్సెస్ కాగలవా?’ అంటూ సంకోచించింది కూడా. ఎందుకంటే నా విషయంలో అమ్మకు పెద్ద నమ్మకం ఉండేది కాదు. తాను ఎంతో సంఘర్షణకు లోనైంది. ‘ఈ రంగంలోకి వస్తే నీ జీవితాన్ని పూర్తిగా దీనికే అంకితం చేయాలి’ అని సూటిగా నా కళ్లలోకి చూస్తూ చెప్పింది. ఆ రోజుని ఇప్పటికీ నేను మరిచిపోలేను’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

