e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News త్వరలో కొత్త పింఛన్లు

త్వరలో కొత్త పింఛన్లు

త్వరలో కొత్త పింఛన్లు

57ఏళ్లు నిండిన వారు అర్హులు
అర్హూలైన దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తిలో దివ్యాంగుల శిబిరం ప్రారంభం
హాజరైన చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందజేసిన మంత్రి

పాలకుర్తిరూరల్‌, మార్చి27: దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. త్వరలో అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో కలిసి దివ్యాంగుల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… 57 ఏళ్లు నిండిన వారికి త్వరలో కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ఆసరా పింఛన్లతో వికలాంగుల్లో ఆత్మగౌరవం పెరిగిందన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మందికి, నియోజక వర్గంలో 5 వేల మంది ఈ పథకంతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. కరోనా కష్ట కాలంలోనూ పింఛన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. దివ్యాంగుల కు ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు.

దివ్యాంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కార్పొరేషన్‌ ద్వారా రూ.20 కోట్లతో 13 వేల మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూ రు వెంకటేశ్వర్‌రెడ్డి, సీడీపీవో జయంతి, ఎంపీపీలు నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీలు శ్రీరాం జ్యోతిర్మయి, పల్లా భార్గవి, మంగళంపల్లి శ్రీనివాస్‌, దేవస్థానం చైర్మన్‌ వీ రాంచంద్ర య్యశర్మ, పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్‌, తీగల దయాకర్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, అర్జున్‌, చిట్యాల సంధ్యారాణి, డీ వెంకన్న, వీరమనేని హనుమంతరావు, మేడారపు సుధాకర్‌ పాల్గొన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
కార్యకర్తలే పార్టీకి ప్రాణం. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇటీవల మృతి చెందిన పాలకుర్తి, దేవరుప్పుల మండలాలకు చెందిన గుంజె రాజు, మొగుళ్ల సోమనర్సయ్య కుటుంబాలకు రూ. 2లక్షల బీమా చెక్కులు అందజేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త్వరలో కొత్త పింఛన్లు

ట్రెండింగ్‌

Advertisement