Ramayana Namit Malhotra | బాలీవుడ్ ‘రామాయణ’ నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రాకు చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయిలోని ఆయన సంస్థ ‘ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్’ కార్యాలయాలతో పాటు, ఆర్థిక సలహాదారులు మరియు సీఏ ఆఫీసుల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. విదేశీ లావాదేవీలు, నిధుల బదిలీకి సంబంధించిన పత్రాలపై అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఐటీ సోదాల వార్తల కారణంగా స్టాక్ మార్కెట్లో ‘ప్రైమ్ ఫోకస్’ షేరు విలువ సుమారు 8 శాతం వరకు పడిపోయింది. అయితే, ఈ తనిఖీలపై ఐటీ శాఖ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల కానున్న తరుణంలో ఈ ఐటీ రైడ్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.