దార్శనికుడి కార్యాచరణ
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ భారతదేశపు ధాన్యాగారంగా తయారైంది.
అడుగడుగున గండాలు.. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు మింగేయటానికి కాచుక్కూర్చున్న రాబందులు.. ధనబలం, మీడియాబలం, రాజకీయబలం, ప్రభుత్వబలం అన్నింటినీ ఉపయోగించి సర్కారును కూల్చటానికి కుట్రలు.. కళ్ల ముందు కనిపించే అభివృద్ధిని కూడా కాదంటూ అడ్డగోలుగా దుష్ప్రచారం చేసే అక్కుపక్షులు.. కొత్త రాష్ర్టానికి అండగా నిలువాల్సిందిపోయి శకుని పాత్రను పోషించే కేంద్రం.. వీటన్నింటినీ తట్టుకొని తొమ్మిదేండ్లపాటు నిరాటంకంగా ముఖ్యమంత్రి పదవిని సమర్థంగా నిర్వహించటం కేసీఆర్‌కు తప్ప మరొకరికి సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ఆకాంక్షకు ఉద్యమ రూపమిచ్చి, అనేకానేక రాజకీయ యుద్ధాలు చేసి స్వరాష్ర్టాన్ని కేసీఆర్ సాధించటం ఎంతటి సాహసిక వాస్తవమో, ఇది కూడా అంతే ఆశ్చర్యానందాలను కలిగించే వాస్తవం. నవ చరిత నిర్మాణమవుతున్న కాలంలో మనమున్నాం.
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ భారతదేశపు ధాన్యాగారంగా తయారైంది. ధాన్యం ఉత్పత్తిలో దశాబ్దాలుగా నెంబర్‌వన్‌గా ఉన్న పంజాబ్‌తో పోటీ పడుతున్నది నేడు. ఇక పాలనాపరంగా, తెలుగు వారి చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఏకబిగిన తొమ్మిదేండ్లు పాలించలేదు. ఇప్పుడా రికార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకొల్పారు. అంతేకాదు, వచ్చే డిసెంబరులో ఎన్నికలు జరిగేలోపు కేసీఆర్ పాలనాకాలం తొమ్మిదేండ్ల ఆరునెలలు పూర్తి చేసుకుంటుంది. యావత్ దక్షిణాదిలోనే ఇది ఒక ముఖ్యమంత్రి నిరాటంక సుదీర్ఘకాల పాలనగా ఘనతకెక్కుతుంది. రాశిలో అనేక రికార్డులు నెలకొల్పుతున్న కేసీఆర్ వాసిలో మరెన్నో ఘన విజయాలను నమోదు చేసి తెలంగాణ మాడల్‌ను ఆవిష్కరించారు.
సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయాన్ని సస్యశ్యామలంగా మార్చటం భారతదేశం గత కొన్ని దశాబ్దాల తర్వాత చూసిన ఒక హరిత విప్లవం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు రంగాన్ని 24 గంటలపాటు వెలుగులు వెదజల్లే నక్షత్రమండలంగా తీర్చిదిద్దటం ఒక అద్భుతం. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా తాగునీటి కోసం అల్లాడే దేశంలో, ఇంటింటికీ సురక్షిత తాగునీటిని అందించిన మిషన్ భగీరథ అబ్బురపరిచే ఒక భగీరథ ప్రయత్నం. ఎత్తున ఉన్న తెలంగాణకు నీళ్లెలా వస్తాయన్న ప్రశ్నకు సమాధానం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. ఇది కేవలం మూడేండ్లలో నిర్మితం కావటం మరో విశేషం. అనేకానేక సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ జలకళను సంతరించుకోవటం కళ్ల ముందే జరిగిన చరిత్ర. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న హరితహారం, ప్రపంచస్థాయి కంపెనీలకు స్వాగతం పలికి, తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మలిచిన టీఎస్-ఐపాస్, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సమీకృత కలెక్టరేట్లు, వందల కొద్దీ కొత్త గురుకులాలు, కార్పొరేట్ హాస్పిటళ్లను తలదన్నే ప్రభుత్వ దవాఖానలు, దేశానికే ఆదర్శంగా నిలిచిన సంక్షేమ పథకాలు, పటిష్ఠమైన శాంతిభద్రతలు.. ఎన్నెన్ని విజయాలు ఈ తొమ్మిదేండ్లలో! ఒక దార్శనికుడి స్వప్నం, ఒక కార్యశీలి ఆచరణ.. రెండింటి సమ్మేళనం కేసీఆర్ పాలన.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

