Somnath | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌ను(Somnath) గురువారం రిజర్వ్ బ్యాంక్(RBI) సెంట్రల్ బోర్డులో సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా నియమించారు. 2025 జనవరిలో ఇస్రో నుంచి పదవీ విరమణ చేసిన సోమనాథ్‌ను, 2026 ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చేలా నాలుగేళ్ల కాలానికి ఈ పదవిలో కొనసాగుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు. అంతరిక్ష కార్యక్రమంలో వివిధ హోదాల్లో సేవలందించిన ఈ ఏరోస్పేస్ ఇంజినీర్, ఇస్రో నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత బెంగళూరు సమీపంలోని లిబరల్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయమైన చాణక్య విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా, బిలియనీర్ ఆనంద్ మహీంద్రాను కూడా మరో నాలుగేళ్లపాటు సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా ఆర్బిఐ తిరిగి నియమించినట్లు మరో ప్రకటనలో పేర్కొంది.
వీరితో పాటు కేంద్ర బోర్డులోని ఇతర సభ్యులలో ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ సర్వీస్ నుండి పదవీ విరమణ చేసి, ఆ తర్వాత ప్రభుత్వ ఖాతాల డిప్యూటీ కంప్ట్రోలర్,ఆడిటర్ జనరల్‌గా పనిచేసిన రేవతి అయ్యర్, అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన, సమాచార వ్యవస్థ (RIS) అనే థింక్ ట్యాంక్ డైరెక్టర్ జనరల్ అయిన సచిన్ చతుర్వేది ఉన్నారు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా, డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్ జె, పూనం గుప్తా, ఎస్.సి. ముర్ము , రోహిత్ జైన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్, ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ లోహియా కూడా కేంద్ర బోర్డులో ఉన్నారు.