కొత్త రేడార్‌ను అభివృద్ధి చేసిన ఇస్రో

బెంగుళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త రేడార్‌ను డెవలప్ చేసింది. సింథటిక్ అపర్చర్ రేడార్(ఎస్ఏఆర్)కు.. ఎక్స్ట్రీమ్ హై రెజల్యూషన్ ఫోటోలు తీసే సామర్థం ఉంటుంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్‌లో భాగంగా ఈ రేడార్‌ను అభివృద్ధి పరిచారు. నాసాతో కలిసి ఇస్రో ఈ రేడార్‌ను వినియోగించనున్నది. రెండు ఫ్రీక్వెన్సీలో ఈ రేడార్‌ను వాడుతారు. ఎల్ మరియ ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీల్లో సార్ రేడార్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది. భూగ్రహం ఎలా మారుతుందన్న అంశాలను కేవలం సెంటీమీటర తేడాల్లోనే ఈ రేడార్‌తో గుర్తించనున్నట్లు నాసా ద్వారా వెల్లడైంది. నిసార్ రేడార్ అభివృద్ధి కోసం 2014, సెప్టెంబర్ 30వ తేదీన నాసా, ఇస్రో మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాది ఆరంభంలో శ్రీహరికోట నుంచి నిర్సార్ రేడార్ నింగిలోకి ఎగరనున్నది. మిషన్ ఎల్ బ్యాండ్ సార్‌ను నాసా అందిస్తున్నది. సైన్స్ డేటా, జీపీఎస్ రిసీవర్లు, పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్‌ను ఎల్-బ్యాండ్ పొందుపరచనున్నది. ఎస్-బ్యాండ్ రేడార్‌ను ఇస్రో అందిస్తోంది. పర్యావరణంలో వచ్చే మార్పులను, మంచు పర్వతాల్లో కదలికలు, భూకంపాలు, సునామీలు లాంటి వాటి గురించి నిసార్ హై రెజల్యూషన్ ఇమేజ్‌లను అందజేస్తుందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

