Harish Rao | సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి: హరీశ్ రావు
కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి వెంటనే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి వెంటనే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాళ్లు, గుడ్లు, టమాటాలతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందన్నారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం..
మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య.
కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 12, 2024
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

