కృత్రిమ కాలితో అందాల పోటీలకు.. ఐర్లాండ్ బ్యూటీ రికార్డు

డబ్లిన్: ఆమె క్యాన్సర్‌ను జయించింది. ఆ హోరాహోరీ పోరులో ఆమె తన కాలును కోల్పోయింది. అంతటితో కథ అయిపోతే ఏమీ లేదు. కానీ కృత్రిమ కాలుతో ఆమె అందాల పోటీలకు సిద్ధమైంది. క్లుప్తంగా ఇదీ బెర్నాడెట్ హగాన్స్ కథ. మిస్ వరల్డ్ ఐర్లాండ్ జాతీయ అందాల పోటీలకు బెర్నాడెట్ ఎంపిక కావడం లోపాలతో కుమిలిపోయేవారికి గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. కలలను సాకారం చేసుకోవడానికి వైకల్యం అడ్డురాదని ఆమె అందంగా నిరూపించారు. 22 ఏళ్ల వయసులో బెర్నాడెట్‌కు కీళ్ల క్యాన్సర్ సోకింది. కుడికాలు తీసేయాల్సి వచ్చింది. తనతోపాటు కుటుంబమూ కృంగిపోయింది. కానీ బెర్నాడెట్ బాధపడుతూ కూర్చునే రకం కాదు. తాను తేరుకుని కుటుంబ సభ్యుల విచారాన్ని తొలగించేందుకు నడుం బిగించింది. మెల్లగా కృత్రిమ కాలుకు అలవాటు పడింది. ఇప్పుడు అదే కాలికో ర్యాంప్ వాక్ చేయబోతున్నది. దీంతో ఆ కుటుంబానికి కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు. తనకు అందాల పోటీలకు వెల్లాలని చిన్నప్పటి నుంచి ఉండేది. ఆమె అభిలాషను గుర్తించిన జెబెడీ మేనేజ్మెంట్ అనే వికలాంగుల సేవా సంస్థ ఆమెకు అవసరమైన సహాయాన్ని, ధైర్యాన్ని సమకూర్చింది. ఆమె కలల సాకారానికి అండగా నిల్చింది. ఇప్పుడు మిస్ వరల్డ్ ఐర్లాండ్ పోటీల ఫైనలిస్టు జాబితాలో చోటు సంపాదించింది. వచ్చే సెప్టెంబర్‌లో జరిగే ఫైనల్ పోటీలు జరగబోతున్నాయి. ఆ సంగతే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. కృత్రిమ కాలితో ర్యాంప్ వాక్ చేయబోతున్న మొట్టమొదటి మోడల్‌గా బెర్నాడెట్ చరిత్ర సృష్టించబోతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

