పర్షియన్ గల్ఫ్‌లో యూఎస్-ఇరాన్ మళ్లీ ముఖాముఖి
పర్షియన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలో మరోసారి అమెరికా-ఇరాన్‌ల మధ్య ముఖాముఖి పరిస్థితిగా తీవ్రంగా మారింది

వాషింగ్టన్ : పర్షియన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలో మరోసారి అమెరికా-ఇరాన్‌ల మధ్య ముఖాముఖి పరిస్థితిగా తీవ్రంగా మారింది. గత కొన్ని రోజులుగా రెండు దేశాలు కత్తులు నూరుతున్నాయి. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూ కదనానికి కాలుదువ్వుతున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతుండటంతో ఇరు దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అమెరికా కాల్పులు జరిపిన తర్వాత ఇరాన్‌కు చెందిన డజన్‌కు పైగా హై-స్పీడ్ మోటర్ బోట్ యుద్ధనౌకలు దగ్గరగా వచ్చాయి. కొన్ని వారాల్లోనే ఇలా ఇరు దేశాల మధ్య ఘర్షణ పరిస్థితి నెలకొనడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
పెంటగాన్ ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ (ఐఆర్జీసీ) 13 ఫాస్ట్ మోటర్ బోట్లు హెర్ముజ్ నీటి ఒప్పందం సమీపంలో దాని యుద్ధనౌక వైపు కదులుతున్నాయి. వీటిని గుర్తించి మొదట రేడియో సందేశం ద్వారా హెచ్చరించారు. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో మెషిన్ గన్స్‌తో బుల్లెట్ల వర్షం కురిపించారు.
అంతర్జాతీయ నిబంధనలను ఇరాన్ నిరంతరం ఉల్లంఘిస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. వీరి ప్రవర్తన సురక్షితమైనది కాదని అమెరికా చెప్తున్నది. దీనికంటే ముందు, యూఎస్ఎస్ మాంటెరే యుద్ధనౌక పర్యవేక్షణలో ఇరాన్ ఈ విధమైన చర్యలే చేపట్టింది. ఇలాంటి చర్యలకు ఎలా స్పందించాలో మా నావికాదళానికి బాగా తెలుసు అని, ఇరానీ ప్రవర్తన చాలా దూకుడుగా ఉన్నదని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ అన్నారు.
ఇవి కూడా చదవండి..
10 వేల మందికి బయో బబుల్ సాధ్యమేనా? : సెరెనా విలియమ్స్
రష్యాలో పాఠశాలపై కాల్పులు: 13 మంది దుర్మరణం
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
అమెరికా చమురు పైప్‌లైన్‌పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
అమెరికా చమురు పైప్‌లైన్‌పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

