IPL 2023 : చిన్నస్వామి స్టేడియం సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తిపోయింది. భారీ స్కోర్లు నమోదైన పోరులో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాఓ గెలిచింది. మూడో విజయం నమోదు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(83), శివం దూబే (52) అర్ధ శతకాలతో చెలరేగడంతో చెన్నై 226 రన్స్ చేసింది. ఆ తర్వాత డూప్లెసిస్(62), మ్యాక్స్‌వెల్(76) దంచికొట్టారు. అయితే.. ఆర్సీబీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి పాలైంది.
Action replay of the previous dismissal!
And once again it’s @msdhoni with the catch 😎
An excellent knock comes to an end for Faf du Plessis as #RCB need 58 off the final five!
Follow the match ▶️ https://t.co/nvoo5Sl96y #TATAIPL | #RCBvCSK pic.twitter.com/vYyULZyLt7
— IndianPremierLeague (@IPL) April 17, 2023
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(6) బౌల్డయ్యాడు. ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్(0) ఔటయ్యాడు. 15 రన్స్‌కే రెండు వికెట్లు పడిన ఆర్సీబీని కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), మ్యాక్స్‌వెల్(76) ఆదుకున్నారు. చెన్నై బౌలర్లను ఉతికి ఆరేసిన వీళ్లు అర్ధ శతకాలతో చెలరేగారు. మూడో వికెట్‌కు 136 రన్స్ జోడించారు. వీళ్లిద్దరూ వెంట వెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. దినేశ్ కార్తిక్(28) చివరిదాకా నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన షహబాజ్() పార్నెల్(2) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు, మథీశ పథిరన, ఆకాశ్ సింగ్, మోయిన్ అలీ ఒక వికెట్ తీశారు.
చిన్నస్వామి స్టేడియం సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తిపోయింది. భారీ స్కోర్లు నమోదైన పోరులో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాఓ గెలిచింది. మూడో విజయం నమోదు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(83), శివం దూబే (52) అర్ధ శతకాలతో చెలరేగడంతో చెన్నై 226 రన్స్ చేసింది. ఆ తర్వాత డూప్లెసిస్(62), మ్యాక్స్‌వెల్(76) దంచికొట్టారు. అయితే.. ఆర్సీబీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి పాలైంది.
Action replay of the previous dismissal!
And once again it's @msdhoni with the catch 😎
An excellent knock comes to an end for Faf du Plessis as #RCB need 58 off the final five!
Follow the match ▶️ https://t.co/nvoo5Sl96y #TATAIPL | #RCBvCSK pic.twitter.com/vYyULZyLt7
— IndianPremierLeague (@IPL) April 17, 2023
ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. పథిరన వేసిన 17వ ఓవర్ మొదటి బంతికే షహబాజ్ అహ్మద్(12) ఔటయ్యాడు.
ఆర్సీబీ మరో వికెట్ కోల్పోయింది. దినేశ్ కార్తిక్(28) ఔటయ్యాడు. తుషార్ దేశ్‌పాండే ఓవర్లో థీక్షణకు క్యాచ్ ఇచ్చాడు. మూడో బంతికి అతడికి లైఫ్ దొరికింది. రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ వదిలేశాడు.
ఆర్సీబీ 16 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది షహబాజ్ అహ్మద్(12), దినేశ్ కార్తిక్(18) క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు కావాలి.
ఆర్సీబీ బిగ్ వికెట్ పడింది. ఫాఫ్ డూప్లెసిస్(62) ఔటయ్యాడు. మోయిన్ అలీ ఓవర్లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆర్సీబీ బిగ్ వికెట్ పడింది. మాక్స్వెల్(76) ఔటయ్యాడు. మథీశ పథిరన బౌలింగ్లోధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫాఫ్ డూప్లెసిస్(54), షహ్బాజ్ అహ్మద్ క్రీజులో ఉన్నారు.
An MSD catch to put an end to a BIG SHOW!
More twists and turns on the way in this game?
Equation down to 81 off 42 for #RCB!
Follow the match ▶️ https://t.co/nvoo5Sl96y #TATAIPL | #RCBvCSK pic.twitter.com/8PFfXPS6S7
— IndianPremierLeague (@IPL) April 17, 2023
దంచికొడుతున్న మాక్స్వెల్(59) హాఫ్ సెంచరీ సాధించాడు. మథీశ పథిరన బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది అతను ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఆ తర్వాత బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఫాఫ్ డూప్లెసిస్(51) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 121/2
ఫాఫ్ డూప్లెసిస్(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. జడేజా వేసిన 9వ ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. మాక్స్వెల్(44) రెండో బంతికి సిక్స్ బాదాడు. దాంతో, స్కోర్ 100 దాటింది. 9 ఓవర్లకు స్కోర్.. 105/2
మథీశ పథిరన వేసిన 8వ ఓవర్లో మాక్స్వెల్(34) రెచ్చిపోయాడు. వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. ఫాఫ్ డూప్లెసిస్(48) క్రీజులో ఉన్నాడు. 8 ఓవర్లకు స్కోర్.. 93/2
పవర్ ప్లేలో ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు స్కోర్ చేసింది. మహీశ్ థీక్షణ వేసిన 6వ ఓవర్లో ఫాఫ్ డూప్లెసిస్(45), మాక్స్వెల్(20) చెరొక సిక్స్ బాదారు.
ఫాఫ్ డూప్లెసిస్(38) జోరు పెంచాడు. ఆకాశ్ సింగ్ వేసిన 5వ ఓవర్లో సిక్స్, రెండు బౌండరీ బాదాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ 60దాటింది. మ్యాక్స్‌వెల్(13) క్రీజులో ఉన్నాడు. ఐదు ఓవర్లకు స్కోర్.. 61/2
ఫాఫ్ డూప్లెసిస్(22) దంచుతున్నాడు. తుషార్ దేశ్ పాండే వేసిన 4వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, సిక్స్ బాదాడు. మ్యాక్స్‌వెల్(13) క్రీజులో ఉన్నాడు. నాలుగు ఓవర్లకు స్కోర్.. 45/2
ఆకాశ్ సింగ్ వేసిన 3వ ఓవర్లో మ్యాక్స్‌వెల్(12) రెండు సిక్స్‌లు బాదాడు. ఫాఫ్ డూప్లెసిస్(6) క్రీజులో ఉన్నాడు. మూడు ఓవర్లకు స్కోర్.. 28/2
ఆర్సీబీకి రెండో వికెట్ కోల్పోయింది. మహిపాల్ లోమ్రోర్() ఔటయ్యాడు. తుషార్ దేశ్‌పాండే ఓవర్లో గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫాఫ్ డూప్లెసిస్(5), మ్యాక్స్‌వెల్ క్రీజులో ఉన్నారు.
తొలి ఓవర్లో ఆర్సీబీకి షాక్.. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(6) బౌల్డయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఆకాశ్ సింగ్ మూడో బంతికి కోహ్లీ వికెట్ సాధించాడు.
How about that for a start for @ChennaiIPL with the ball 🔥🔥
IMPACT PLAYER Akash Singh gets Virat Kohli in the first over 💪
Follow the match ▶️ https://t.co/nvoo5Sl96y #TATAIPL | #RCBvCSK pic.twitter.com/m8aiiPzfVU
— IndianPremierLeague (@IPL) April 17, 2023
చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, ఆర్సీబీ ముందు 227 పరుగుల టార్గెట్ పెట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(83), శివం దూబే (52) అర్ధ శతకాలతో చెలరేగారు. చివర్లో మోయిన్ అలీ(19), రవీంద్ర జడేజా(10) ధనాధన్ ఆడడంతో 6 వికెట్ల నష్టానికి చెన్నై భారీ స్కోర్ చేసింది. హర్షల్ పటేల్, మ్యాక్స్‌వెల్ వేసిన 20వ ఓవర్లో 16రన్స్ వచ్చాయి.
Relief for @RCBTweets as Shivam Dube departs after an electrifying 52 off 27 💥@WayneParnell gets the wicket and @mdsirajofficial takes a sharp catch near the ropes 👌👌
Follow the match ▶️ https://t.co/nvoo5Sl96y #TATAIPL | #RCBvCSK pic.twitter.com/rQYEQH6BXZ
— IndianPremierLeague (@IPL) April 17, 2023
టాస్ ఓడిపోయిన చెన్నైకి మూడో ఓవర్లోనే షాక్.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(3)ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే(83), అజింక్యా రహానే(37) ఇన్నింగ్స్ నిర్మించారు. రెండో వికెట్‌కు 74 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే(52) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడిన అతను 25 బంతుల్లో 2 పోర్లు ఐదు సిక్స్‌లతో ఫిఫ్టీ కొట్టాడు. అంబటి రాయడు (14) ఫర్వాలేదనిపించాడు.
చెన్నై ఐదో వికెట్ పడింది. అంబటి రాయుడు(14) ఔటయ్యాడు. విజయ్‌కుమార్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులకు ఫోర్, సిక్స్ కొట్టిన అతను నాలుగో బంతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖరి బంతికి మోయిన్ అలీ(8) సింగిల్ తీయడంతో చెన్నై స్కోర్ 200 దాటింది. రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. 18 ఓవర్లకు చెన్నై స్కోర్.. 200/5
శివం దూబే(52) ఔటయ్యాడు. పార్నెల్ ఓవర్లో సిక్స్ కొట్టి యాభై పూర్తి చేసుకున్న అతను ఆ తర్వాత బంతికి భారీ షాట్ ఆడాడు. బౌండరీ వద్ద సిరాజ్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో దూబే నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
శివం దూబే(52) ఫిఫ్టీ బాదాడు. పార్నెల్ ఓవర్లో సిక్స్ కొట్టి యాభై పూర్తి చేసుకున్నాడు. 25 బంతుల్లో 2 పోర్లు ఐదు సిక్స్‌లతో అతను 52రన్స్ చేశాడు.
5⃣0⃣ for @IamShivamDube in just 2⃣5⃣ balls! 💪 💪
This has been a stunning knock 👌👌
Follow the match ▶️ https://t.co/QZwZlNk1Tt#TATAIPL | #RCBvCSK pic.twitter.com/yXE7JWQVuE
— IndianPremierLeague (@IPL) April 17, 2023
ఓపెనర్ డెవాన్ కాన్వే(72) దంచుతున్నాడు. విజయ్‌కుమార్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు, ఆఖరి బంతికి సిక్స్ బాదాడు. శివం దూబే(10) క్రీజులో ఉన్నాడు. 12 ఓవర్లకు చెన్నై స్కోర్..123/2
చెన్నై స్కోర్ వంద దాటింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో శివం దూబే(9) భారీ సిక్స్ బాదాడు. ఓపెనర్ డెవాన్ కాన్వే(57) క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లకు చెన్నై స్కోర్..107/2
ఓపెనర్ డెవాన్ కాన్వే(55) హాఫ్ సెంచరీ కొట్టాడు. వనిందు హసరంగ బౌలింగ్‌లో రెండు రన్స్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి బంతికి డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్స్ బాదాడు. ఆఖరి బంతికి ఫోర్ కొట్టాడు. 14 రన్స్ వచ్చాయి. శివం దూబే(1) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు చెన్నై స్కోర్.. 97/2
వనిందు హసరంగ బిగ్ వికెట్ తీశాడు. ధాటిగా ఆడుతున్న అజింక్యా రహానే(37)ను బౌల్డ్ చేశాడు. దాంతో, 74 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(48) హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
.@Wanindu49 with his first wicket of the match 👏 👏
Second success with the ball for @RCBTweets 👌 👌#CSK 2 down as Ajinkya Rahane departs after a quickfire 37
Follow the match ▶️ https://t.co/QZwZlNk1Tt#TATAIPL | #RCBvCSK pic.twitter.com/583pc6kP0D
— IndianPremierLeague (@IPL) April 17, 2023
ఓపెనర్ డెవాన్ కాన్వే(42) జోరు పెంచాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ బాదాడు. ఆఖరి బంతికి అజింక్యా రహానే(37) ఫోర్ కొట్టాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 67 రన్స్ జోడించారు. 9 ఓవర్లకు చెన్నై స్కోర్.. 83/1
డెవాన్ కాన్వే(30) దూకుడుగా ఆడుతున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన 7వ ఓవర్లో సిక్స్ బాదాడు. అజింక్యా రహానే(29) క్రీజులో ఉన్నాడు. 7 ఓవర్లకు స్కోర్.. 62/1
అజింక్యా రహానే(28) దంచుతున్నాడు. వేనీ పార్నెల్ ఐదో ఓవర్ రెండో బంతికి ఫోర్, ఐదో బంతికి 91 మీటర్ల సిక్స్ బాదాడు. ఆరోబంతికి ఫోర్ కొట్టాడు. 15 రన్స్ వచ్చాయి. దాంతో, సీఎస్కే స్కోర్ యాభై దాటింది. 6 ఓవర్లకు స్కోర్..53/1 డెవాన్ కాన్వే(22) క్రీజులో ఉన్నాడు.
డెవాన్ కాన్వే(21), అజింక్యా రహానే(14) జోరు పెంచారు. విజయ్‌కుమార్ వైశాక్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి కాన్వే ఫోర్ కొట్టాడు.మూడో బంతిని రహానే స్టాండ్స్‌కు తరలించాడు. 13 రన్స్ వచ్చాయి. 5 ఓవర్లకు స్కోర్.. 38/1
చెన్నై నాలుగు ఓవర్లకు వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(15), అజింక్యా రహానే(7) క్రీజులో ఉన్నారు.
చెన్నైకి షాక్. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(3) ఔటయ్యాడు. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో రెండో బంతికి షాట్ ఆడాడు. పార్నెల్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. డెవాన్ కాన్వే(13), అజింక్యా రహానే క్రీజులో ఉన్నారు.
In the air & taken in the deep by @WayneParnell! 👏 👏@mdsirajofficial gives @RCBTweets an early breakthrough 👌 👌#CSK lose Ruturaj Gaikwad.
Follow the match ▶️ https://t.co/QZwZlNk1Tt#TATAIPL | #RCBvCSK pic.twitter.com/wellECkSPS
— IndianPremierLeague (@IPL) April 17, 2023
వేనీ పార్నెల్ వేసిన రెండో ఓవర్లో డెవాన్ కాన్వే(13) ఫోర్, ఆఖరి బంతికి సిక్స్ బాదాడు. 13 రన్స్ వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్(3) క్రీజులో ఉన్నాడు. 2 ఓవర్లకు స్కోర్.. 16/0
సిరాజ్ వేసిన తొలి ఓవర్లో 3 రన్స్ వచ్చాయి. డెవాన్ కాన్వే(2), రుతురాజ్ గైక్వాడ్(1) క్రీజులో ఉన్నారు.
ఇరుజట్లు సబ్స్టిట్యూట్స్ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి.
ఆర్సీబీ సబ్స్టిట్యూట్స్ : సుయాశ్ ప్రభుదేసాయ్, డేవిడ్ విల్లే, అకాష్ దీప్, కరన్ శర్మ, అనుజ్ రావత్.
సీఎస్కే సబ్స్టిట్యూట్స్ : ఆకాశ్ సింగ్, డ్వేన్ ప్రిటోరియస్, సుభాన్షు సేనాపతి, షేక్ రషీద్, రాజ్వర్ధన్ హంగర్గేకర్.
🚨 The @RCBTweets and @ChennaiIPL line-ups are IN 👌 👌
Follow the match ▶️ https://t.co/QZwZlNju3V #TATAIPL | #RCBvCSK pic.twitter.com/OhiomXlSBZ
— IndianPremierLeague (@IPL) April 17, 2023
ఇరుజట్లు తుది ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఆర్సీబీ గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతోంది. సీఎస్కేలో గాయపడిన మగల స్థానంలో మథీశ పథిరన ఆడుతున్నాడు.
ఆర్సీబీ టీమ్ : ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షహబాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), వనిందు హసరంగ, వేనీ పార్నెల్, విజయ్‌కుమార్ వైశాక్, సిరాజ్.
సీఎస్కే టీమ్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మోయిన్ అలీ, అంబటి రాయుడు, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎం.ఎస్.ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), మథీశ పథిరన, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ.
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ టాస్ గెలిచాడు. పిచ్ ఛేజింగ్‌కు అనుకూలిస్తుందని చెప్పి ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
𝘌𝘹𝘤𝘪𝘵𝘦𝘮𝘦𝘯𝘵. 𝘗𝘢𝘴𝘴𝘪𝘰𝘯. 𝘉𝘶𝘻𝘻𝘪𝘯𝘨 𝘈𝘵𝘮𝘰𝘴𝘱𝘩𝘦𝘳𝘦 ⏳#RCB skipper @faf1307 aptly summarises the #RCBvCSK clash 🔥🔥
Who do you reckon is it going to be tonight in Match 2⃣4⃣ of #TATAIPL - ❤️ or 💛 pic.twitter.com/8dZH81VFsR
— IndianPremierLeague (@IPL) April 17, 2023