నవీద్‌బాబు, శివాంగిమెహ్రా, నికిషా, ఆనంద్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇంటి నంబర్13’. పన్నా రాయల్ దర్శకుడు. హేసన్పాషా నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. బుధవారం ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇంటి నంబర్ 13లో జరుగుతున్న అనూ హ్య పరిణామాల వెనకున్న రహస్యమేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. యూనిక్ పాయింట్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు’ అని తెలిపారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరినీ మెప్పించే చిత్రమిదని, త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత అన్నారు. పృథ్వీరాజ్, సుదర్శన్ కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్. మణికర్ణన్.