కిటానం ఏసుడు
కొత్త చేటల భద్రతకు, మన్నికకు ఉడకబెట్టిన కాగితాల ముద్ద, పసుపు మిశ్రమాన్ని పూతగా పూయడం. దీంతో చేటలు ఎక్కువకాలం మన్నికతో ఉంటాయి.
సోరుడు
ప్రేతాత్మ ఆవహించడం (అగో చిన్నోడికేదో సోరింది. తిక్కతిక్కగా జేస్తుండే అక్కో)
బుక్కలోడు
జనం సొమ్ము బాగా తినడానికి అలవాటుపడ్డ వ్యక్తి (ఈ బుక్కలోడు మన తాత సొమ్మంతా తిన్నడు.
అది కక్కేదాక తన్నాలె).
మావురుగప్పుడు
చలికాలంలో పొగమంచు కురవడం లేదా ఆ పొగమంచు వల్ల దూరంలో ఉన్నవి కనిపించకపోవడం
(ఇయ్యాల ఊరంతా మావురుగప్పింది. ఎదురుంగ వచ్చేటియి కనిపిస్తలేవు).
దిగ్గొరుగుడు
కేశ ఖండనం తర్వాత క్షవరం చేయించడం కుదరకపోతే, మళ్లీ పూర్తిగా వెంట్రుకలు తీయడం.