బంజారాహిల్స్, నవంబర్ 10: హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ (ఎల్వీపీఈఐ)కు చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్ఫోర్డ్ వర్సిటీ ప్రతిఏటా ప్రపంచంలోని శాస్త్రవిజ్ఞానంలో శాస్త్రవేత్తల పరిశోధనల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధ్యయనం నిర్వహిస్తున్నది. వీరిలో నేత్రవైద్యంలో అనేక పరిశోధనల్లో పాలుపంచుకున్న ఎల్వీపీఈఐకి చెందిన డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు, ప్రొఫెసర్ దొరైరాజన్ బాలసుబ్రమణియన్, డాక్టర్ సావిత్రీశర్మ, ప్రొఫెసర్ జిల్కీఫ్, డాక్టర్ ప్రశాంత్ గర్గ్లకు లైఫ్ టైం అచీవర్స్ జాబితాలో చోటులభించింది. మాజీ ఫ్యాకల్టీ సభ్యులు వీరందేర్ సంగ్వాన్, సంతోష్ హోనావర్, జయ్ చట్లాని, రవిథామస్, ఉందుర్తి ఎన్ దాస్ తదితరులకు కూడా జాబితాలో చోటుదక్కింది.