తొలి స్వదేశీ డీప్ సీ రెస్క్యూ షిప్ ‘ఐఎన్ఎస్ నిస్తార్’ భారత నావికాదళ అమ్ములపొదిలోకి చేరింది. గురువారం దీనిని విశాఖపట్నంలో జల ప్రవేశం చేశారు. ఈ డైవింగ్ సపోర్ట్ వెసెల్ (డీఎస్వీ)ని హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ డిజైన్ చేసి, అభివృద్ధి చేసింది.
డీప్ సీ డైవింగ్, రెస్క్యూ ఆపరేషన్ల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది నావికాదళం డీప్ సబ్‌మెరైన్ రెస్క్యూ వెసెల్ (డీఎస్ఆర్వీ)కి మాతృనౌకగా కూడా పనిచేస్తుంది. ఈ సరికొత్త నౌక బరువు 10 వేల టన్నులు. పొడవు 118 మీటర్లు.