Asian Games : భారత హాకీ చరిత్రలో మరో మరచిపోలేని రోజు. మహిళల జట్టు 64 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ స్వర్ణంతో మురిసిపోగా.. పురుషుల జట్టు సైతం పసిడి కాంతులు విరజిమ్మింది. శనివారం మలేషియాతో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు గోల్స్‌తో రెచ్చిపోయారు. 4-1తో జయభేరి మోగించిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన గోల్డ్ మెడల్‌ను నిలబెట్టుకుంది. టోర్నీ ఆసాంతం సూపర్ షో చేసిన మహిళల, పురుషుల జట్లు లాస్ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించాయి.
పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్లు స్వర్ణాలతో చెలరేగాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పురుషుల జట్టు 4-1తో మలేషియాను చిత్తు చేసి ఐదో పసిడిని ఖాతాలో వేసుకుంది. గతంలో టీమిండియా.. 1996, 1998, 2014,2022లో గోల్డ్ మెడల్ సాధించింది. శనివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో.. తొలి అర్ధ భాగంలో కెప్టెన్ 12వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. కాసేపటికే ప్రత్యర్థి జట్టు గోల్‌తో స్కోర్ సమం చేసింది.
WE ARE COMING FOR LA 2028! 🥹🇮🇳
India’s Men’s Hockey Team defeats Malaysia 5-1 to win the Gold Medal! 🥇
Successfully defends the Asian title! 💪
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/O9gDdxVNOx
— The Khel India (@TheKhelIndia) October 3, 2026
ఆపై 41వ నిమిషంలో హార్దిక్ బంతిని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి పంపాడు. 54వ నిమిషంలో అభిషేక్ మెరవగా .. 4-1తో స్వర్ణం సాధించింది హర్మన్‌ప్రీత్ సింగ్ సేన. ఇప్పటికే చైనాను 1-0తో ఓడించిన భారత మహిళల జట్టు 46 ఏళ్ల తర్వాత తొలి పసిడిని గెలుపొందింది. గోల్డ్ మెడల్ సాధించిన ఇరుజట్లు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ – 2028 పోటీలకు నేరుగా అర్హత సాధించాయి.
𝗧𝗛𝗘 𝗜𝗡𝗗𝗜𝗔𝗡 𝗠𝗘𝗡’𝗦 𝗛𝗢𝗖𝗞𝗘𝗬 𝗧𝗘𝗔𝗠 𝗜𝗦 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡 𝗢𝗡𝗖𝗘 𝗔𝗚𝗔𝗜𝗡! 🇮🇳🥇
India defeat Malaysia 5-1 in the Asian Games 2026 final to successfully defend their crown and create history by winning consecutive Asian Games gold medals… pic.twitter.com/ZaBzKMGyJw
— Hockey India (@TheHockeyIndia) October 3, 2026