Asian Games : పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో అథ్లెట్ల స్ఫూర్తితో భారత బాక్సర్లు రెచ్చిపోతున్నారు. ఎనిమిదో రోజైన ఆదివారం ఏకంగా ముగ్గురు తమదైన దూకుడుతో పతకం ఖరారు చేశారు. క్వార్టర్ ఫైనల్లో చెలరేగిన అంకుశ్ పంగల్ (పురుషుల 80 కిలోల విభాగం), ప్రవీణ్ హుడా (మహిళల 65 కిలోల విభాగం), నరేందర్ బెర్వాల్(పురుషుల 90ప్లస్ విభాగం)లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. తద్వారా ఈ బాక్సింగ్ త్రయానికి కనీసం కాంస్యం దక్కనుంది.
నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల ఎనిమిదో రోజు భారత బృందం అదరగొడుతోంది. స్క్వాష్, మహిళల 200 మీటర్లలో పతకాలు రాగా.. బాక్సర్లు సైతం ముందంజ వేశారు. క్వార్టర్ ఫైనల్లో సూపర్ విక్టరీతో సెమీస్‌కు చేరి, కనీసం కాంస్యం ఖరారు చేశారు. తొలుత పురుషుల 80 కిలోల విభాగం క్వార్టర్స్‌లో అంకుశ్ పంగల్ పంజా విసిరాడు. ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో పసిడితో మెరిసిన అతడు ఆదివారం నెక్రుజ్ సలొమోవ్(తజకిస్థాన్)పై పంచ్‌ల వర్షం కురిపించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో అతడు 5-0తో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లాడు.
MEDAL CONFIRMED 🇮🇳 Ankush (80kg) won against Nekruz Salimov (Tajikistan) and confirmed medal at the Asian Games 2026 as he enters the Semi Finals.#IndianBoxing #AsianGames pic.twitter.com/iy2EXObXmm
— LockerRoom (@lockerroom_in) September 27, 2026
అనంతరం మహిళల 65 కిలోల బౌట్లో ప్రవీణ్ హుడా ధాటికి ఉజ్బెకిస్థాన్ బాక్సర్ చిత్తుగా ఓడింది. ఆరంభం నుంచి పంచ్‌లతో విరుచుకుపడిన హుడా చివరకు 5-0తో విజేతగా నిలిచింది. మరో క్వార్టర్స్‌లో.. నరేందర్ బెర్వాల్ కుమ్మేశాడు. 90 ప్లస్ కేటగిరీలో థాయ్‌లాండ్ బాక్సర్ అడ్తపాంగ్ సీంగ్టెప్ను బెంబేలెత్తించిన భారత బాక్సర్.. రిఫరీ స్టాప్స్ కంటెస్ట్ ద్వారా సెమీస్‌లో అడుగుపెట్టాడు. అయితే.. 60 కిలోల విభాగంలో కచ్చితంగా పతకం గెలుస్తాడనుకున్న సచిన్ సివాచ్ మాత్రం నిరాశపరిచాడు. షున్సుకే కిటమొటో (జపాన్ బాక్సర్) చేతిలో అనూహ్య ఓటమితో సచిన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
MEDAL CONFIRMED 🇮🇳 Narender (90+kg) won by First Round RSC against Adthapong Saengtep of Thailand and confirmed medal at Asian Games 2026.#IndianBoxing #AsianGames pic.twitter.com/FiK6tuP7gt
— LockerRoom (@lockerroom_in) September 27, 2026