IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
IL-76MD | భారత వైమానిక దళం (Indian Air Force) అరుదైన రికార్డు సృష్టించింది. వాయుసేనకు చెందిన రష్యన్ తయారీ భారీ రవాణా విమానం ‘ఐఎల్-76ఎండీ (IL-76MD)’.. లఢఖ్‌లోని 13,629 అడుగుల ఎత్తయిన న్యోమా వైమానిక స్థావరంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రపంచంలో ఈ విమానం సాధించిన అత్యంత ఎత్తయిన ల్యాండింగ్ ఇదేనని వాయుసేన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
IL-76MD : భారత వైమానిక దళం (Indian Air Force) అరుదైన రికార్డు సృష్టించింది. వాయుసేనకు చెందిన రష్యన్ తయారీ భారీ రవాణా విమానం ‘ఐఎల్-76ఎండీ (IL-76MD)’.. లఢఖ్‌లోని 13,629 అడుగుల ఎత్తయిన న్యోమా వైమానిక స్థావరంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రపంచంలో ఈ విమానం సాధించిన అత్యంత ఎత్తయిన ల్యాండింగ్ ఇదేనని వాయుసేన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
విమానం అసాధారణ సామర్థ్యానికి ఇదొక నిదర్శనమని, సిబ్బంది అత్యుత్తమ నైపుణ్యాలు, కచ్చితత్వం దీనికి తోడయ్యాయని ఐఏఎఫ్ తెలిపింది. ఈ ల్యాండింగ్‌ను దేశ వ్యూహాత్మక వాయు రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతంచేసే చారిత్రక ఘట్టంగా పేర్కొన్నది. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యోమా వ్యూహాత్మక వైమానిక స్థావరం గత ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లనూ ల్యాండ్ చేయొచ్చు. లద్దాఖ్‌లో ఈ తరహా నాలుగో వైమానిక స్థావరం ఇది. మిగతా మూడు లేహ్, కార్గిల్, థోయిస్లలో ఉన్నాయి. సైనిక అవసరాలకు అనుగుణంగా ఎల్ఎసీ వెంబడి అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ (ALG) సహా దాదాపు అన్ని ఎయిర్‌ఫీల్డ్‌లలో రక్షణశాఖ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్‌ఫీల్డ్‌గా పేరుపొందిన దౌలత్ బేగ్ ఓల్డీ ఏఎల్జీలో కూడా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

