న్యూఢిల్లీ, నవంబర్ 3: బాలాకోట్ వైమానిక దాడుల హీరో, భారత వాయుసేన యువ పైలట్ అభినందన్ వర్థమాన్‌కు పదోన్నతి లభించింది. వాయుసేనలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న అభినందన్‌ను గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోట్ చేశారు. ఇది సైనిక దళంలో కర్నల్ ర్యాంక్‌కు సమానం. ఆయనకు పదోన్నతి కల్పించేందుకు భారత వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, దీంతో అభినందన్‌కు త్వరలో కొత్త ర్యాంక్ ఇవ్వనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. బాలాకోట్ దాడుల సందర్భంగా మిగ్-21 విమానంతో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చేసిన అభినందన్‌ను ప్రభుత్వం ఇప్పటికే ‘శౌర్యచక్ర’తో సత్కరించింది.