మానౌస్(బ్రెజిల్): ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా నాలుగు దేశాల పర్యటనలో భారత మహిళల సీనియర్ సాకర్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. బ్రెజిల్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 1-6 తేడాతో భారీ ఓటమి చవిచూసింది. తమ(57) కంటే మెరుగైన ర్యాంక్‌లో బ్రెజిల్(7)..టీమ్ఇండియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ తరఫున మనీశా కల్యాణ్(8ని) ఏకైక గోల్ చేసింది. మరోవైపు బ్రెజిల్ జట్టులో దెబోరా ఒలీవిరా(1ని), గీయోవన కోస్టా(36ని), అడ్రియాన బోర్గెస్(52ని, 81ని), కెరోలిన్ ఫెర్రాజ్(54ని), ఫెరీరా(76ని) గోల్స్ చేశారు. మ్యాచ్‌లో బ్రెజిల్ 70 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకుని గోల్స్‌తో విరుచుకుపడింది.