IND vs NZ ODI | భారత్-కివీస్ తొలి వన్డేకు వరుణుడి బ్రేక్.. వర్షంతో ఆలస్యమైన టాస్
IND vs NZ ODI | ఆక్లాండ్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారాడు. బుధవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగాల్సిన తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది.
IND vs NZ ODI | ఆక్లాండ్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారాడు. బుధవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగాల్సిన తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో గ్రౌండ్ సిబ్బంది సూపర్ సాపర్తో మైదానాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వాతావరణం కాస్త మెరుగుపడినప్పటికీ టాస్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
రోహిత్, కోహ్లీపైనే ఫోకస్
వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ భారత జట్టుకు కీలకం కానుంది. ముఖ్యంగా తమ కెరీర్లో చివరిసారిగా కివీస్ గడ్డపై ఆడబోతున్న భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రోకో)పైనే అందరి ఫోకస్ ఉంది. అయితే, అనుభవజ్ఞులైన పేసర్లు లేకపోవడం భారత్‌ను ఇబ్బంది పెడుతోంది. పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా అందుబాటులో లేకపోవడంతో పేస్ బౌలింగ్ భారం మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌పైనే పడనుంది.
పెర్త్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక బౌన్స్ లభించే ఈడెన్ పార్క్ మైదానంలో స్ట్రెయిట్ బౌండరీలు 55 మీటర్లు మాత్రమే ఉండటంతో బౌలర్లకు పరుగులను అడ్డుకోవడం పెద్ద సవాలుగా మారనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే వెల్లింగ్టన్ వేదికగా ఈ నెల 19 నుంచి న్యూజిలాండ్‌తో టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు పలువురు టెస్టు ఆటగాళ్లు చివరి రెండు వన్డేలకు దూరంగా ఉండనున్నారు. దాంతో తొలి పోరులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది.
బంతిపైనే బెంగ
బ్యాటింగ్ విభాగంలో భారత్‌కు పెద్దగా సమస్యల్లేవు. ఓపెనర్లుగా రోహిత్, గిల్ మెరుపు ఆరంభం ఇవ్వాలని చూస్తుండగా.. వన్‌డౌన్‌లో కింగ్ కోహ్లీ తనదైన నిలకడను చూపిస్తే జట్టుకు తిరుగుండదు. న్యూజిలాండ్ గడ్డపై 13 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 36.41 సగటుతో 437 పరుగులు చేసిన రోహిత్ ఇక్కడ ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. వయసు దృష్ట్యా కివీస్ గడ్డపై తనకిదే చివరి సిరీస్ కానుండటంతో ఆ లోటును పూడ్చాలని హిట్‌మ్యాన్ పట్టుదలగా ఉన్నాడు. నాలుగో స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో నంబర్లో వచ్యే కేఎల్ రాహుల్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకుంటారు.
ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, ఈ మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటున్న నితీశ్ రెడ్డి బరిలోకి దిగడం ఖాయం. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ పేస్ విభాగానికి నాయకత్వం వహించనుడగా.. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అతని కలిసి కొత్త బంతితో మెరుగైన దాడి చేయాల్సిన అవసరం ఉంది. 8వ స్థానంలో హిట్టింగ్ సామర్థ్యం ఉన్న అన్షుల్ కాంబోజ్ ను ఆడించాలా? లేదంటే 6.6 అడుగుల పొడగరి గుర్నూర్ బ్రార్‌కు చాన్స్ ఇవ్వాలా? అన్నది మేనేజ్మెంట్ తేల్చాల్సి ఉంది. ఇక, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలా లేదా బ్యాటింగ్ లోతు పెంచేందుకు స్పిన్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్నే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
కివీస్‌కు గాయాల బెడద
ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును గాయాలు వేధిస్తున్నాయి. పలువురు ప్రధాన ఆటగాళ్ల సేవలు కోల్పోయి వన్డే సిరీస్ ఆరంభానికి ముందే డీలా పడింది. మార్క్ చాప్మన్, రచిన్ రవీంద్ర గాయాలతో సిరీస్ మొత్తానికి దూరం కాగా.. ప్రాక్టీస్ డ్రిల్స్‌లో తమ పేసర్ మ్యాట్ హెన్రీతో ఢీకొని ఓపెనర్ డెవాన్ కాన్వే తీవ్రమైన కంకషన్ గాయానికి గురయ్యాడు. దీంతో కాన్వే తొలి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. తన స్థానంలో హెన్రీ నికోల్స్ లేదా టిమ్ సిఫర్ట్లో ఒకరికి అవకాశం దక్కినుంది. తొలి మూడు టీ20ల్లో తేలిపోయినా.. చివరి రెండింటిలో గెలిచి ఆత్మవిశ్వాసం పెంచుకున్న కివీస్ కీలక ఆటగాళ్లు లేకుండా ఈ ఫార్మాట్లో భారత్‌కు ఎలా బదులిస్తుందో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ ODI | భారత్-కివీస్ తొలి వన్డేకు వరుణుడి బ్రేక్.. వర్షంతో ఆలస్యమైన టాస్
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

