India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
India-US trade deal | భారత్-అమెరికా (India-US) దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాని (Trade deal) కి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో అంటే 2025 ఫిబ్రవరిలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మొదటి దశకు సంబంధించిన ముసాయిదాను ఖరారు చేశాయి. అయితే అమెరికా సుంకాల విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఇరుపక్షాలను మళ్లీ చర్చలకు వచ్చేలా చేశాయి.
India-US trade deal : భారత్-అమెరికా (India-US) దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాని (Trade deal) కి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో అంటే 2025 ఫిబ్రవరిలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మొదటి దశకు సంబంధించిన ముసాయిదాను ఖరారు చేశాయి. అయితే అమెరికా సుంకాల విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఇరుపక్షాలను మళ్లీ చర్చలకు వచ్చేలా చేశాయి. భారత్‌తో సహా 14 ఆర్థికవ్యవస్థలపై అమెరికా కొత్త సుంకాల ప్రతిపాదన చేసింది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవాలంటే కొన్ని కీలకమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
ఈ వాణిజ్య ఒప్పందం దేనికి..?
అమెరికా విధించే అధిక సుంకాల నడుమ తన ఎగుమతుల పోటీతత్వాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా దక్షిణాసియా, ఆగ్నేయాసియాల్లోని పోటీదేశాల తయారీ రంగ ఆర్థికవ్యవస్థలపై ఆధిక్యతను సాధించడానికి భారత్ ఈ ఒప్పందాన్ని కోరుకుంటున్నది.
సుంకాలు ఎందుకు..?
వాణిజ్య లోటును పూడ్చడానికి, దేశీయ పరిశ్రమలను విదేశీ పోటీ నుంచి కాపాడటానికి, తనకు అనుకూలమైన నిబంధనలపై వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేలా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా.. భారత్ లాంటి తన వాణిజ్య భాగస్వాములపై సుంకాలను ప్రయోగిస్తున్నది. భారత్, చైనా లాంటి వాణిజ్య భాగస్వాములు తమ వస్తువులపై అధిక దిగుమతి సుంకాలు విధిస్తూ, నియంత్రణాత్మక నిబంధనలు పాటిస్తూ.. అమెరికా మార్కెట్లోకి తక్కువ సుంకాలతో తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయని అమెరికా ఆరోపించింది.
సుంకం అంటే ఏమిటి..?
ఒక ఉత్పత్తిని దిగుమతి చేసుకునే దేశం తన భూభాగంలోకి ప్రవేశించే వస్తువులపై విధించే కస్టమ్స్ లేదా ఇంపోర్ట్ డ్యూటీని సుంకం అంటారు. దీనిని దిగుమతిదారు చెల్లిస్తారు. ఈ సుంకాలు దిగుమతి వస్తువుల ధరలను పెంచుతాయి. వాటిని దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తుల కంటే ఖరీదైనవిగా మారుస్తాయి. దేశీయ పరిశ్రమలను రక్షించడానికి, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి, వాణిజ్య ప్రవాహాలను ప్రభావితం చేయడానికి ఈ సుంకాలను ఉపయోగిస్తారు.
మనకు యూఎస్ మార్కెట్ ఎందుకు ముఖ్యం..?
అమెరికా 2021-22 నుంచి భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది. 2025-26లో ఎగుమతులు 0.92 శాతం పెరిగి 87.3 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. దిగుమతులు 15.95 శాతం పెరిగి 52.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అమెరికాతో భారతదేశ వాణిజ్య మిగులు 2024-25లో 40.89 బిలియన్ డాలర్ల నుంచి 2025-26లో 34.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. వస్త్రాలు, ఔషధాలు, ఇంజినీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు సంబంధించి భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉన్నది.
అమెరికాలో సుంకాల స్వరూపం ఎందుకు మారుతోంది..?
అమెరికా 2025 ఆగస్టు 7 నుంచి 25% సుంకాన్ని ప్రకటించింది. రష్యా చమురును భారత్ నిరంతరం కొనుగోలు చేసినందుకు జరిమానాగా భారతీయ వస్తువులపై అదనంగా 25% సుంకం విధించింది. ఈ ఉత్తర్వు తర్వాత మినహాయింపుల జాబితాను మినహాయిస్తే ఇతర భారతీయ వస్తువులపై మొత్తం సుంకం 50 శాతానికి పెరిగింది. 2026 ఫిబ్రవరి 2న భారత్, అమెరికా ఒక వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా-భారత్ తమ వస్తువులపై పరస్పర సుంకాన్ని 18 శాతానికి తగ్గించడానికి అంగీకరించాయి. అయితే ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు పరస్పర సుంకాల వ్యవస్థను కొట్టివేసింది.
తాజా పరిణామాలకు కారణమేంటి..?
నవంబర్ 25న యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం.. భారతదేశంతో సహా 14 ఆర్థికవ్యవస్థలలోని నిర్మాణాత్మక అధిక ఉత్పాదక సామర్థ్యంపై జరిపిన తన రెండవ సెక్షన్ 301 విచారణల ఫలితాలను ప్రకటించి, వాటి వస్తువులపై అదనపు సుంకాలను ప్రతిపాదించింది. భారతదేశంపై 25% వరకు సుంకాలను ప్రతిపాదించడంతోపాటు, ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రేటును 17%కి సర్దుబాటు చేయవచ్చని కూడా సూచించింది.
భారత్‌పై అమెరికా ఆరోపణలు..?
భారతదేశ పారిశ్రామిక విధానాలు (‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోగ్రామ్, పీఎల్ఐ పథకాలు వంటివి), తయారీ రంగ విస్తరణ ప్రణాళికలు, కార్మిక రక్షణలు, ఆర్థిక పద్ధతులు, మార్కెట్ ప్రవేశానికి ఉన్న అడ్డంకులు నిర్మాణాత్మక అదనపు సామర్థ్యానికి దోహదపడి, అమెరికన్ సంస్థలకు నష్టం కలిగిస్తున్నాయని యూఎస్టీఆర్ ఆరోపిస్తున్నది. ఉక్కు, సౌరశక్తి, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, సమాచార, కమ్యూనికేషన్ల సాంకేతికత వంటి రంగాలను ఆందోళన కలిగించే అంశాలుగా గుర్తించింది.
భారత్ స్పందన..?
ఏ రంగంలోనూ తమకు నిర్మాణాత్మక అదనపు సామర్థ్యం లేదని పేర్కొంటూ భారత్ ఈ ఆరోపణలను తిరస్కరించింది. వాణిజ్య సంబంధిత ఆందోళనలను వాణిజ్య ఒప్పంద చర్చల పరిధిలోనే పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పింది. ఫిబ్రవరి 7 2026న జారీచేసిన సంయుక్త ప్రకటనకు అనుగుణంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని (BTA) త్వరగా ఫైనల్ చేయడం కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నది.
సంయుక్త ప్రకటన..?
ఇరుదేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ఒక మధ్యంతర ఒప్పందం కోసం ఇరుపక్షాలు ఒక చట్రానికి చేరుకున్నట్లు సంయుక్త ప్రకటనలో రెండు దేశాలు ప్రకటించాయి.
ఒప్పందంలోని నిబంధనలు
భారత్ అన్ని అమెరికా పారిశ్రామిక వస్తువులపైనా, అలాగే విస్తృత శ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపైనా సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం చేస్తుంది.
మధ్యంతర ఒప్పందం విజయవంతమైతే భారతీయ వస్తువులపై అమెరికా 18 శాతం పరస్పర సుంకాన్ని విధిస్తుంది.
ముఖ్య గమనిక : ఏదైనా దేశం అంగీకరించిన సుంకాలలో ఏవైనా మార్పులు జరిగితే అవతలి దేశం తన కట్టుబాట్లను సవరించుకోవచ్చని అమెరికా, భారత్ అంగీకరిస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఇంధన ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌ను కొనుగోలు చేయాలని భారత్ ఉద్దేశిస్తున్నది.
చర్చల ప్రస్తుత స్థితి..?
అమెరికా సుంకాల విధానం అమల్లోకి వచ్చి, పోటీ దేశాలపై భారత్‌కు తులనాత్మక ప్రయోజనం లభించిన తర్వాత, ఈ ఒప్పందం ఖరారైనట్లుగా సంతకాలు చేస్తామని పలు సందర్భాల్లో భారత్ పేర్కొన్నది. వాణిజ్య ఒప్పందం ఖరారైతే భారతదేశంపై 17 శాతం సుంకాన్ని విధించాలని తాజా USTR నివేదిక ప్రతిపాదించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
Terrorist Arrested | ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అరెస్ట్.. ఏకే-47 స్వాధీనం
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

