దేశంలో కరోనా పంజా.. ఒకే రోజు 72 వేల కేసులు, 459 మంది మృతి
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా | దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 72,330 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గతేడాది అక్టోబర్ తర్వాత భారీగా పాజిటివ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. తాజాగా 459 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఒక్కరోజులో ఎక్కువ మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్ 17న 335 మంది మృత్యువాతపడ్డారు.
తాజాగా 40,382 మంది డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,21,665కు చేరింది. ఇప్పటి వరకు 1,14,74,683 మంది కోలుకున్నారు. 1,62,927 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 5,84,055 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా 6,51,17,896 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 887 కరోనా కేసులు
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
కరోనా విలయం.. 500 మంది చిన్నారులకు పాజిటివ్
అధికార పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

